News

ముఖేశ్ అంబానీ నివాసం వద్ద లభ్యమైన పేలుడు పదార్థాలు…ఇంతకీ ఈ పనిచేసింది ఎవరు…!

mukesh ambani house

ఇండియాలో బడా వ్యాపార దిగ్గజం ఐన ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల లభ్యమయ్యాయి. ముంబయిలోని అంబానీ నివాసం యాంటిల్లాకు దగ్గర్లో పేలుడు పదార్థాలు ఉన్న ఒక స్కార్పియో వాహనం తీవ్ర ఆందోళన కు గురిచేసింది.

ఈ వాహనాన్ని గుర్తించిన ముఖేశ్ అంబానీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న పోలీసులు మరియు బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు వాహనాన్ని, పరిసరాలను తనిఖీ చేపట్టారు.

ఈ విషయం పై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పందిస్తూ, ఆ వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్టు కనుగొన్నామని తెలిపారు. దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

కాగా, ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్ చేసి ఉంటారనేదానిపై అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నామని తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button