sports news in telugu

MS Dhoni Cricket Academy: తెలంగాణ, ఏపీలో క్రికెట్ అకాడమీ పెట్టనున్న ధోని..!

MS Dhoni Cricket Academy

MS Dhoni Cricket Academy: మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రిటైర్మెంట్ తీసుకున్న తరువాత తనలాగే వీలైనంత మందిని స్టార్స్ ని చేయాలనే సంకల్పంతో అకాడమీలను ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేస్తున్నాడు.

వచ్చే రెండేండ్లలో కనీసం 25 అకాడమీలను ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. పట్టణ ప్రాంతాలతో పాటుగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ ఆటగాల్ల ను తాయారు చేయాలనీ , ప్రాక్టీస్ చేయడానికి తన అకాడమీని ఉపయోగించుకోవాలని తెలిపాడు. యవకులకుల  కెరీర్ ప్రారంభంలోనే అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు.

భారత్ లో  ఇప్పటికే 50కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. విదేశాల్లో కూడా మూడింటిని ఇప్పటికే నెలకొల్పాడు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీని  ‘ధోనీ క్రికెట్ అకాడమీ’ పేరుతో హైదరాబాద్  లో  ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కనీసం 20-25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది . దీనికోసమని ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ.. బ్రెయినియాక్స్ బీతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button