ఏమిటో ఇంగ్లీష్ భాష అంటున్న Mr. మజ్ను
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున మరో వారసుడు అక్కినేని అఖిల్. మనం సినిమాలో స్పెషల్ గెస్ట్ గా కనిపించి ఆ తరువాత “అఖిల్” మూవీతో తొలిసారి హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించాడు. ఆ తరువాత “హలో” అంటూ వచ్చాడు. ఇవి రెండు సినిమాలు అఖిల్ కి హిట్ ని రుచి చూపించలేకపోయాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి Mr. majnu అంటూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ అక్కినేని వారసుడు. ఈ రోజు (గురువారం) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నిన్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ పక్కన నిధి అగర్వాల్ జోడీగా కనిపించబోతుంది. ఈ ఫస్ట్ లుక్ టీజర్ తరహాలో 49 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ వీడియోలో అఖిల్ క్యారెక్టర్ ని చూపించే ప్రయత్నం చేసారు చిత్ర యూనిట్.
‘‘దేవదాసు మనవడు మన్మధుడికి వారసుడు కావ్యంలో కాముడో అంతకన్నా రసికుడో’’ అంటూ మొదలై ఆకట్టుకుంటోంది. ‘ఏమిటో ఇంగ్లీష్ భాష దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు’ అని అఖిల్ చెప్పిన డైలాగ్ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అమ్మాయిల మధ్య తిరిగే ఓ యువకుడిగా కనిపించాడు. డిఫరెంట్ హెయిర్ స్టెయిల్తో ఆకట్టుకొన్నాడు. మొత్తానికి ఈ టీజర్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేశారు యూనిట్ సభ్యులు. ఈ Mr. majnu మూవీ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఎక్కువ భాగం ఈ సినిమా లండన్ లో షూటింగ్ జరుపుకుంది.
Mr. majnu చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ని ఇంకా రివీల్ చేయలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముందు నుండి ప్రచారం అవుతున్నట్లే ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్‌నే ఖరారు చేసారు.