సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు ..

జయప్రకాశ్ రెడ్డి ‘బ్రహ్మ పుత్రుడు’ సినిమాతో వెండితెరకు పరిచయమై, వెంకటేష్ నటించిన “ప్రేమించుకుందాం రా ” సినిమాలో తన విలక్షణమైన పాత్ర తో జయప్రకాశ్ ప్రజలకు మరింత చేరువయ్యారు.
జయప్రకాశ్ గారు సినిమా షూటింగ్ లు లేకపోవడంతో గుంటూరు లోనే ఉంటున్నారు,తాను మంగళవారం రోజు తెల్లవారుజామున బాత్రూమ్ లో గుండెపోటుతో కుప్పకూలి పోయారు.
ప్రకాష్ గారు రాయలసీమ యాసలో మాట్లాడే తీరు సినీ అభిమానులకు దగ్గరయ్యేలా చేసింది అని చెప్పవచ్చు.
తాను కామెడీ విలన్ పాత్రలు చేస్తూ ఎన్నో సినిమాలలో తన ప్రతిభను చాటుతూ వెండితెరను ఉర్రుతలూగించారు.బాలకృష్ణ హీరోగా “సమరసింహారెడ్డి “సినిమాలో జయప్రకాశ్ విలన్ గ నటించారు, ఈ సినిమాలో తన నటనకు నంది అవార్డు వచ్చింది.
ఇతను సినిమాలకు రాకముందు పోలీసు శాఖలో పనిచేసేవారు తనకు నటనపై ఆశక్తివుండడంతో ,అటు నాటకాలలోను,ఇటు సినిమాలలోనూ నటించేవారు.
జయప్రకాశ్ గారు కర్నూలు జిల్లా ,ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల లో జన్మించారు. వీరి మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ నివాళులు తెలిపింది.