Movie Artists Association (MAA) Elections Results 2021

maa elections 2021 results – ఈరోజు ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్ మాదిరిగా జరుగుతున్నాయి , ఎప్పుడు ఓట్లు వేయని స్టార్ హీరోస్ వోటింగ్ లో పార్టిసిపేట్ చేయటం , ముంబై లో ఉన్న జానీలియా ని రప్పించటం ఇలా చాలా విచిత్రాలు జరిగాయి , ఇక జానీలియాని రప్పించటం వెనకాల ఎవరు ఉన్నారో జనాలకి తెలియనిది కాదు
మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ హుటా పోటా పోటీగా పోటీ పడుతున్న ఈ మా ఎలేక్షన్స్ మంచి ఎంటెర్టైన్మెంట్ ని ఇచ్చింది , మీరు మీరు తన్నుకోండి మాకు మాత్రం ఇంటెర్ట్న్మెంట్ పంచండి అన్న రీతిగా జనాలు ఉన్నారు, యూట్యూబుల్లో trollers అయితేనేమి , వాడి వేడిగా తిట్టుకోవటం అయితేనేమి చాల బాగా ఎంజాయ్ చేశారు. ఇక మంచు అన్నయ్య అంటే trollers కి మంచి పండగే , ఇక అతగాడు మాట్లాడే అతి మాటలు మంచి నవ్వులు పంచాయి .
అందులో చెప్పుకోదగ్గవి
1> నేను భారత దేశం లోనే no 1 స్టార్ అయి ఉండే వాడిని ఒక వేళా నేను ఫామిలీ బాక్గ్రౌండ్ వాడుకొని ఉంటే అని మంచు విష్ణు అనటం !!!!
2>తన తెలుగు గొప్పతనం గురించి మాట్లాడుతూ తంగుతూరి ప్రకాసం పంతులు అనటం ఆశర్యనికి గురిచేసింది , trollers కి పండగ పంచింది
3> ఒక ప్రముఖ ఛానల్ లో మంచు ప్యానల్ కావాలా , మంచి ప్యానళ్లు కావాలా అని విష్షుని అడగటం , మంచి వినోదాన్ని
పంచింది

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ రెండు వైస్ ప్రెసిండెంట్ పదవులకు బెనర్జీ , హేమ పోటీ చేయగా , మంచు విష్ణు ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబు మోహన్ గారు , రెండు వైస్ ప్రెసిండెంట్ పదవులకి గాను మాదాల రవి పృథ్వీ రాజ్ పోటీ చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ లో విష్ణు స్వల్ప మెజారిటీ తో గెలిచారు, అందులో ఉన్నది ఎక్కువ వృద్ధ కళాకారులే కాబట్టి మిగతా వోటింగ్ రిజల్ట్స్ పైన దృష్టి పెట్టారు.
ఇక మెయిన్ బ్యలెట్స్ లో ప్రకాష్ రాజ్ టీమ్ నుండి విజయం సాధించిన వారు, అనసూయ, శివ రెడ్డి, కౌషిక్ , సురేష్ కొండేటి.
మంచు విష్ణు ప్యానెల్ నుండి మాణిక్, హరినాథ్, బొప్పన శివ, జయ వాని, శ్రీ వాని, మాదాల రవి గెలిచారు.
కొసమెరుపు : మంచు విష్ణు గెలిచాడు, జనాలు అవాక్కయ్యారు.
పూర్తిగా జనాల కామెంట్స్ మరియు జరిగే పరిణామాల దృష్ట్యా ఈ ఆర్టికల్ రాయటం జరిగింది.