Movie :- ఆకాశవాణి (2021) – Aakashavaani Review

Movie Review: Aakashavaani
Star Cast :- సముద్రఖని , గెటప్ శ్రీను మొదలగు వారు
Producers :- పద్మ నాభ రెడ్డి
Music director :- కాల భైరవ
Director : – Ashwin Gangaraju
కథ :-
ఈ కథ పట్నం నుంచి చాల అంటే చాల దూరం లో ఉన్న గూడెం లో మొదలవుతుంది. అక్కడ ఉన్న ప్రజలకు దేవుడంటే దొర ( వినయ్ వర్మ ). గూడెం లోని ప్రజలకి అసలు లోక జ్ఞానం ఉండదు. ఎంతసేపు దొర చెప్తే దేవుడు చెప్పినట్లే. దొర కి కోపం వస్తే దేవుడికి కోపం వచ్చినట్లే అనే బ్రహ్మలో బ్రతికేసారు. దొర వీరితో చేయరాని పనులు అన్ని చేయిస్తుంటారు. గంజాయి తయారు చేయడం ఆలా దానికి తోడు దొర ఒక గీత గీసి ఎవరైనా ఆ గీత దాటి బయటికి పోవాలని అనుకున్నారో వారు చనిపోతారని గూడెం లో ఉన్న ప్రజలకు భయపెట్టిస్తాడు. గూడెం లోని అమాయకపు ప్రజలు కూడా దేవుడే ఇదంతా చేపిస్తున్నాడు అని గుడ్డిగా నమ్మేస్తుంటారు.
గూడెం లో ఉన్న రంగడు(మైమ్ మధు) కి తన కొడుకు గిడ్డగాడు(ప్రశాంత్) అంటే ప్రాణం. గిడ్డగాడు మేకలకాపరి పని చేస్తుంటాడు. ఆలా ఒకరోజు గిడ్డగాడు పనిచేస్తున్న సమయం లో దొర మనిషి రేడియో తో వస్తాడు.గిడ్డగాడు ఆ రేడియో చూసి షాక్ అయ్యాడు. ఎపుడు అలాంటి ఒక వస్తువు చూడలేదు. వెంటనే గిడ్డగాడు తన దగ్గర ఉన్న మేకని దొర మనిషికి ఇచ్చి ఆ రేడియో తీసుకున్నాడు. ఇక్కడనుంచి అసలైన కథ మొదలవుతుంది. ఆ రేడియో ద్వారా గూడెం లోని ప్రజల్లో మార్పు ఎలా వస్తుంది? సముద్రఖని టీచర్ గా వీరి జీవితం లో ఎలాంటి మెరుపులు చేయబోతున్నారు ? గూడెం లోని ప్రజలలో మార్పులు గమనించి దొర ఎం చేయబోతున్నాడు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా సోనీ లివ్ లో చూడాల్సిందే.
👍🏻:-
- ‘సముద్రఖని’ నటన సినిమాకే హై లైట్. సెకండ్ హాఫ్ నుంచి వచ్చే సముద్రఖని టీచర్ గా సొంత డబ్బింగ్ తో ప్రేక్షకులకు అలరిస్తారు. దొర గా వినయ్ వర్మ బాగా చేసారు. గిడ్డగాడు గా ప్రశాంత్ కూడా అంతే బాగా చేసారు. మిగితా పాత్రదారులందరు చాల బాగా చేశారు.
- రెండవ భాగం మొత్తం.
- కథ.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎🏻:-
- కథనం.
- దర్శకుడు కథ బాగా రాసుకున్నపటికి సరిగా కధనం రాసుకోలేకపోయారు.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
- మొదటి భాగం.
- దోర చుట్టే ఎక్కువ శాతం సినిమా ఉండటం.
Final Verdict :-
ఆకాశవాణి అనే సినిమా కథ పరంగా కొత్తగా ఉన్నపటికీ కథనం సరిగ్గా లేకపోవడం ప్రేక్షకులకు అలరించలేకపోతుంది. సముద్రఖని తన బెస్ట్ నటనతో అలరిస్తారు. కాకపోతే అయన సెకండ్ హాఫ్ లో రావడం వళ్ళ మొదటి భాగం అంత ఒకే చోట ,దోర చుట్టే తిరగడం చేత ప్రేక్షకులకు నిరాశ చెందిస్తుంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్ మీద మరియు కధనం మీద కొంచెం శ్రద్ధ పెట్టింటె సినిమా ఇంకో లెవెల్ లో ఉండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఆకాశవాణి అనే సినిమా సముద్రఖని నటన కోసం మరియు గూడెం లోని ప్రజల కోసం ఓసారి చూసేయచ్చు. కొత్తదనం కోరుకునే వారికీ ఇది ఒక మంచి సినిమా అనిపిస్తుంది.
Rating:- 2.25/5