Most Eligible Bachelor Movie Review – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

Cinema :- Most Eligible Bachelor Movie Review (2021)
నటీనటులు :- అక్కినేని అఖిల్ , పూజ హెగ్డే , ఫరియా అబ్దుల్లా , ఈషా రెబ్బా , మురళి శర్మ , పోసాని కృష్ణ మురళి , సుడిగాలి సుధీర్.
నిర్మాతలు :- బన్నీ వాసు , వాసు వర్మ
సంగీత దర్శకుడు :- గోపి సుందర్
Director : Bommarillu Bhaskar.
Story (Spoiler Free ) :-
ఈ కథ అఖిల్ , చిన్మయి మరియు రాహుల్ మధ్య జరిగే సన్నివేశాలతో మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ న్యూయార్క్ లో హర్ష (అఖిల్ ) పనిచేస్తుంటాడు. హర్ష యూ.యస్ లో తన కథని చెప్తూ ఉండగా , పెళ్ళిచూపుల కోసం ప్రిపేర్ ఆయు మ్యారేజ్ ఎలాగైనా చేసుకొనే రావాలని ఇండియా కి వస్తాడు.
అదే సమయం లో స్టాండ్ అప్ కమెడియన్ గా విభా ( పూజ హెగ్డే ) ని చుపియడం జరుగుతుంది. హర్ష పెళ్ళిచూపుల చాల కామెడీ గా సాగాయి. హర్ష మరియు విభా మధ్య లవ్ సన్నివేశాలు మొదలవుతూ లెహరాయి సాంగ్ తో సినిమా హై ఫ్లో లో వెళ్తుంది. ఇంతలోనే కోర్ట్ లో మరల కామెడీ సన్నివేశాలు బాగా ఎంటర్టైన్మెంట్ వే లో నడుస్తుంది.
ఇలా హర్ష , విభా మధ్య లైఫ్ హ్యాపీ గా సాగుతుంది అని అనుకునే సమయం లో ఇద్దరిమధ్య విబేధాలొచ్చి వేరైపోతారు. అసలు సడన్ గా హర్ష మరియు విభా మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి ? వారు విడిపోయేంత కారణాలు ఎం వచ్చాయి ? హర్ష పెళ్లిచేసుకొని న్యూయార్క్ వెళ్ళాడా లేదా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే వెళ్ళాడా ? విభా మరియు హర్ష ఎలా మరల కలుసుకుంటారు ? అనే ప్రశ్నలతో మొదటి భాగం పూర్తయి సెకండ్ హాఫ్ కి దారి తీస్తుంది.
Positives 👍 :-
- అక్కినేని అఖిల్ మరియు పూజ హెగ్డే కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమా మొదటి నుంచి చివరిదాకా హర్ష మరియు విభానే కనబడ్డారు తప్ప అఖిల్ , పూజ ఎక్కడ కనబడలేదు. సినిమా అంత వీరిద్దరి బుజాల పైనే వేసుకొని నడిపించేసారు అనే అంతలా ఉంది.
- దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది.
- ఫస్ట్ హాఫ్ మరియు కామెడీ బాగా పండించారు.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరపు సన్నివేశాలు మరియు ల్యాగ్ ఉంటుంది.
Overall :-
మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ , సినిమా మొదటి భాగం అంత ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. అఖిల్ మరియు పూజ కెరీర్ బెస్ట్ పెరఫార్మన్సెస్ ఇచ్చారు. సినిమా అంత వీరి నటనతోనే ప్రేక్షకులు స్క్రీన్ కి కనెక్ట్ అయిపోతారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం చాల రిఫ్రెషింగ్ గా మరియు చాల మటుకు అలరించే దిశలోనే సాగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి , సినిమాటోగ్రఫీ చాల స్టైలిష్ గా ఉంది. కెమెరా విజువల్స్ చాల బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అనవసరపు సన్నివేశాలు పెట్టడంతో నిరాశ చెందిస్తుంది , దానికరణంగానే ల్యాగ్ మరియు బోర్ కొట్టిస్తుంది.
ఈ ఒక నెగటివ్ పక్కన పెట్టేస్తే సినిమా అంత ప్రేక్షకులని చాల బాగా అలరించిస్తుంది అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు.
దసరా విన్నర్ అక్కినేని అఖిల్. మొత్తానికి అఖిల్ హిట్ కొట్టేశాడొచ్.
Rating :- 3.5/5