Monolith : మిస్టరీ రాయి ఇపుడు మన దేశంలో కూడా బయటబడింది…. దీని ప్రత్యేకత ఏమంటే…
“మిస్టీరియస్ మోనోలిత్” ఇది ఓ ప్రత్యేకమైన ఏకశిల. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మోనోలిత్ 30 నగరాల్లో మాత్రమే ఏర్పడింది. తాజాగా ఇండియాలోని గుజరాత్ రాష్ట్రంలో వెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని తల్తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్ లో అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో మిస్టరీ మోనోలిత్ ఏర్పడింది.ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా ఉండి.. దాని ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఉన్నాయి
ఈ మిస్టరీ పై అక్కడ పని చేస్తున్న పార్క్ తోటమాలి ఆశారాం అడగగా తాను సాయంత్రం చూసేటప్పటికీ ఏకశిల లేదని ఉదయం పార్కు వచ్చేసరికి ఏకశిల కనబడటంతో ఆశ్చర్యపోయానని తెలిపారు. ఈ మిస్టీరియస్ మోనోలిత్ వార్త విన్న వెంటనే పార్క్ మేనేజర్ వాపోయారు.

మిస్టీరియస్ మోనోలిత్ పై పై అధికారులు వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పార్కు ని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పీపీపీ మోడ్ కింద ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసింది.