telugu gods devotional information in telugu

కార్తీక తదియ సోమవార ఆరాధన

కార్తీక మాస సోమవారం ఆరాధన ఫలితాలు.

కార్తీక మాసం లోని ప్రతిరోజు విశిష్టమైన రోజే . . . ప్రతిరోజు ఏదో ఒక ప్రాచుర్యం పొంది ఉంటుంది. కాబట్టి ఈ మాసం లో ఏరోజు పుణ్యకార్యాలు ఆరాధనలు చేసిన కూడా అనంత పుణ్యఫలితం పొందవచ్చు. అలాంటివి నిత్యం చేయలేని వారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆరాధన చేయడం వల్ల కూడా ఎన్నో రెట్ల పుణ్య ఫలితాలు పొందవచ్చు అని కార్తీక పురాణం తెలుపుతుంది.

చంద్రుడు అధిదేవత గా గలరోజు సోమవారం . . సోమవారం శివునికి ప్రీతివంతమైన రోజు, అందునా కార్తీక సోమవారం మరింత గొప్పది. ఈరోజు తదియ తో కూడిన సోమవారము. ఈరోజు గౌరి శంకరుల ఆరాధన , అభిషేకం , అలంకరణ , ప్రదక్షిణ, దీప దానం, సమారాధనలు పెక్కు పుణ్య ఫలితం ఇస్తాయి. సాయం సమయాన అమ్మవారి కి చేసే కుంకుమార్చన, రుద్రాభిషేకం మీకు సులభంగా వారి అనుగ్రహం కలిగిస్తాయి.
సాంబ సదాశివ సాంబ సదాశివ

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button