Monday shivaradhana visheshas
ఈరోజు విశిష్ట ఆరాధన విశేషాలు

Monday shivaradhana visheshas ఈరోజు యొక్క ఆధ్యాత్మిక విశేషాలు ఈ కథనంలో . .
ఈరోజు సోమవారం మార్గశిర బహుళ దశమి. చిత్త నక్షత్రంతో కుడి యున్నది. తిధి దశమి కాబట్టి అమ్మవారి ఆరాధన కు ఎంతో ఉపయోగపడుతుంది.
సోమవారం కాబట్టి చంద్రుడి యొక్క ఆధిక్యత అధికంగా ఉంటుంది.చంద్రుడు మనః కారకుడు.ఒక వ్యక్తి యొక్క మనసు మీద చంద్రుని ప్రభావం ఉంటుంది. ఆ చంద్రుడు ఇచ్చే ఫలితం ఆధారంగానే అతడి సంతోషం లేదా విచారం అనేవి ఆధారపడి ఉంటుంది.చంద్రుని యొక్క అనుగ్రహము కోసం, చంద్రుని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటం కోసం చంద్రుని శిరసు పైన ధరించిన చంద్రశేఖరుడు అనబడే శివుని ఈ సోమవారం రోజున విశిష్టంగా ఆరాధన చేయాలి.
.చంద్రుడు ఔషదములకు కారకుడు. ఔషధ మొక్కలు వృద్ధి చెంది శక్తి వంతం అయ్యేది ఈ చంద్ర కాంతిలోనే కాబట్టి ఔషధాలు ఉపయోగించే వారు కూడా చంద్రుని అనుగ్రహం కోసం తప్పకుండా శివారాధన చేయాలి సోమవారం రోజున.సోమవారం సాయంత్రం వేళ శివుని ఆలయ దర్శనం చేసి దీపారాధన చెసి ఆలయం ప్రాంగణంలో చంద్రశేఖర అష్టకం చదవడం వల్ల మీకు చంద్రుని తో సహ శివుని అనుగ్రహము ఆరోగ్యం సిద్ధిస్తాయి.
ఓం మహదేవాయ నమః