Monal Gajjar: నిమిషానికి 5 లక్షలు ఇస్తేనే చేస్తానంటున్న మోనాల్
Monal Gajjar: నిమిషానికి 5 లక్షలు ఇస్తేనే చేస్తానంటున్న మోనాల్ : మోనాల్ గజ్జర్… ఈ పేరు ఇప్పుడు తెలియని వారు ఎవరూ ఉండరు. బిగ్బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ గుజరాతి ముద్దుగుమ్మ… తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ 98 రోజులు హౌస్ లో ఉన్న సంగతి తెలిసిందే.

సుడిగాడు చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోనాల్… అంతగా ప్రేక్షకులను ఆకర్షించే లేకపోయింది. ఆ తర్వాత పలు తమిళ ,మలయాళ చిత్రాల్లో నటించింది. మళ్ళీ తిరిగి 2015లో హీరో అల్లరి నరేష్ “బ్రదర్ అఫ్ బొమ్మాలి” చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయినా మోనాల్ కి అదృష్టం కలిసి రాలేదు. మళ్లీ సినిమాలో సెకండ్ ఛాన్స్ కోసం బిగ్ బాస్ 4 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత..మోనాల్ కి క్రేజ్ పెరిగిపోయింది. మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. దీనికి తోడు మోనాల్ ఇప్పుడు వచ్చిన ఏ అవకాశాలను కూడా వదులుకోవడం లేదు. ఇప్పటికే స్టార్ మా లో ప్రసారం అవుతున్న “డాన్స్ ప్లస్” షో లో గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసింది.

తాజాగా హీరో “బెల్లంకొండ శ్రీనివాస్” హీరో గా నటిస్తున్న “అల్లుడు అదుర్స్” చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ కోసం మోనాల్ ని చిత్రయూనిట్ ఆశ్రయించగా…మోనాల్ 15 లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ ఐటెం సాంగ్ మూడు నిమిషాల నిడివి ఉంటుందట.. అంటే నిమిషానికి ఐదు లక్షలు రూపాయలు అన్నమాట. మోనాల్ అడిగిన రెమ్యునరేషన్ కి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారట. ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.