Tollywood news in telugu
Monal Gajjar: “డ్యాన్స్ ప్లస్” షో కి హోస్ట్ గా మోనాల్..

బిగ్ బాస్ ఫేమ్, నటి మోనాల్ గజ్జర్ తన అందచందాలతో అద్భుతమైన ఆట ప్రదర్శనతో బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని అలరించింది. మొదట చిన్నాచితక చిత్రంలో నటించిన మోనాల్ కి రానురాను అవకాశాల కరువవడంతో బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే కావచ్చు స్టార్ వారు మోనాల్ కి ఒక్క బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఈ ఆదివారం ప్రసారం కానున్న డ్యాన్స్ ప్లస్ షో కి హోస్ట్ గా మోనాల్ గజ్జర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మా వారు బిగ్ బాస్ ఫేమ్ సుజాత ,గంగవ్వ కు కూడా వ్యాఖ్యాతగా పలు షోలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
