Siraj: హైదరాబాద్ కి వచ్చిన తరువాత నేరుగా సిరాజ్ అక్కడికే వెళ్ళాడు…

Siraj: ఆసీస్ ఇండియా నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. కానీ అదే సమయంలో హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న తన తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూశారు.

దీంతో ఆస్ట్రేలియాలో ఉన్న సిరాజ్ కి బిసిసిఐ ఇండియా వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చిన… తన తండ్రి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చడానికి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. మ్యాచ్ లో ఆతిథ్య జట్టు కంగారుల 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో సిరాజ్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.

తాజాగా ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన సిరాజ్..తన ఇంటికి వెళ్లకుండా..నేరుగా తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఈ మేరకు సిరాజ్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించి, ప్రార్థనలు చేశాడు.తన తండ్రి చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు అవకాశం దొరికినందుకు తను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని సిరాజ్ వెల్లడించారు.