sports news in telugu
Siraj Crying: క్రికెట్ మ్యాచ్ మధ్యలో కంటతడి పెట్టిన సిరాజ్..ఎందుకంటే

హైదరాబాద్ కు చెందిన ఇండియా క్రికెట్ యువ పేసర్ మహ్మద్ సిరాజ్ మ్యాచ్ ప్రారంభంలో కంటతడి పెట్టాడు.
ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టులో గాయం కారణంగా రెండో టెస్టులో ఆడకపోవడంతో మహ్మద్ సిరాజ్ ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో సిరాజ్ 5 వికెట్లు తీసి భారత్ విజయానికి దోహదపడ్డాడు. ఈ మేరకు గురువారం సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో కూడా సిరాజ్ ఆడబోతున్నాడు. మొదట మ్యాచ్ ప్రారంభం లో జాతీయ గీతాన్ని ఆలపిస్తూన్న సందర్భంలో సిరాజ్ కంటతడి పెట్టాడు ఇటీవల తన తండ్రి చనిపోయినప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ ఆడుతున్నాడు కాబట్టే హైదరాబాద్ కి వెళ్ళలేకపోయాడు. అందుకే మ్యాచ్ ఆరంభంలో భావోద్వేగానికి గురై సిరాజ్ కంటతడి పెట్టాడని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది