Today Telugu News Updates
గోరెటి వెంకన్నకు గవర్నర్ కోటాలో MLC ఖరారు !

సిఎం కెసిఆర్ అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విదంగా గవర్నర్ కోటాలో ఖాళీ అయినా MLC స్థానాలను మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, ప్రముఖ ప్రజా గాయకుడు గోరెటి వెంకన్న పేర్లు ఖరారయ్యాయి.
సారయ్య గారు ఇంతకముందు కాంగ్రెస్ తరపున వరంగల్ తూర్పు నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు. మరియు రాష్ట్ర మంత్రిగా సేవలను అందించారు.
అలాగే వైశ్య సామజిక వర్గం కోటాలో దయానంద్ కు అవకాశం వచ్చింది. ఇంకా తెలంగాణ ఉద్యమం లో తన పాటతో ప్రజలను ఉర్రుతలూగించిన గాయకుడూ గోరెటి వెంకన్నకు అవకాశం ఇచ్చారు.
గవర్నర్ కోటాలో ప్రజలకు సేవచేసే అవకాశం ఇచ్చినందుకు కెసిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.