Tollywood news in telugu

mimi 2021 – సినిమా :- మిమి (2021)

mimi 2021 : సినిమా :- మిమి (2021)

నటీనటులు :- కృతి సనోన్, పంకజ్ త్రిపాఠి, సాయి తమంకర్, సుప్రియా పాథక్.

నిర్మాతలు:- : దినేష్ విజన్

డైరెక్టర్ :- లక్ష్మణ్ ఉటేకర్

లాక్డౌన్ సమయం లో ప్రజలకి ఓటీటీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు కృతి సనోన్ నటించిన మిమి సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.

mimi Story

ఈ కథ మిమి (కృతి సనోన్) జీవిత ఆశయం చూపించడంతో మొదలవుతుంది. సినిమాలలో హీరోయిన్ గా నటించాలన్నదే తన ఒకేఒక కోరిక. ఆలా అవకాశాల కోసం తాను తిరుగుతూ ఉండగా
భాను(పంకజ్ త్రిపాఠి) అనే క్యాబ్ డ్రైవర్ మిమి కి డబ్బు అవసరం ఉంటుంది అని గ్రహించి తనకి సర్రోగేట్ తల్లిగా ఒక యుఎస్ దంపతులకి చెయ్ నీకు 20 లక్షల డబ్బు వస్తుంది అని చెప్పగానే, ఆ డబ్బుకి ఆశపడి సరోగసీకి ఒప్పుకుంటుంది. తాను గర్భం తెచ్చుకొని జీవిస్తున్న సమయం లో అనుకోకుండా యుఎస్ దంపతులు విడాకులు తీసుకొని విడిపోతారు. ఇపుడు మిమి పరిస్థితి ఏంటి? సమాజం లో మిమి ఎలా జీవిస్తుంది ? కుటుంబం లో ఎలాంటి నిందలు ఎదురుకోనుంది ? యుఎస్ దంపతులు మిమి గురించి ఆలోచించారా లేదా ? చివరికి మిమి పరిస్థితి ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా వెంటనే నెట్ ఫ్లిక్ లో చూసేయండి.

👍🏻:-

  • మిమి గా కృతి సనాన్ పాత్రలో జీవించేసి ప్రజలను కంటతడి పెటించేస్తాది. ఒక సర్రోగేట్ మదర్ గా తాను సమాజంలో ఎదురుకున్న ఇబందులు అన్ని స్పష్టంగా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
  • కథ మరియు కథనం కొత్తగా మరియు ఆలోచింపచేసేలా ఉన్నాయి.
  • దర్శకుడు ప్రతి చిన్న విషయం చాల క్లియర్ గా చూపించేసి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.
  • సినిమాలోని పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
  • సినిమాటోగ్రఫీ చాల బాగుంది.

👎🏻:-

  • పెద్దగా ఏమి లేవు.

mimi Final Verdict

మొత్తానికి మిమి అనే సినిమా అన్ని విభాగాల మనుషులను అలరించి , కంటతడి పెటిస్తాది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కృతి తన పాత్రలో జీవిచేసింది. మిగిలిన పాత్రలు కూడా బాగా నటించారు. దర్శకుడు తాను చుపించాలనుకుంది ఎక్కడ తగ్గకుండా చూపించేసి విజయ బాటలో అడుగు పెటేశాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే లీక్ అవడం వళ్ళ పబ్లిసిటీ సరిగా జరగకపోయినా కంటెంట్ సూపర్ కాబట్టి అందరు నెట్ ఫ్లిక్ లో చూడాలని మనవి. ఈ వారం కుటుంబం తో కలిసి హ్యాపీ గా చూసేయచ్చు ఈ మిమి ని, డోంట్ మిస్.

రేటింగ్ :- 3.5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button