Tollywood news in telugu
tamannah :మిల్కీ బ్యూటీ వెబ్ సీరీస్ టైటిల్ ‘ఎలెవెంత్ అవర్’.. పోస్టర్ రిలీజ్ !

tamannah :కరోనా టైంలో థియేటర్లకు ప్రత్యామ్నాయంగా నిలిచిన ఓటీటీ ప్లేయర్స్ కు సపోర్ట్ గా నిలిచే కథానాయికల్లో తమన్నా కూడా చేరింది. అటు సినిమాలతో పాటు, ఇటు ఓటీటీ వేదికలకు వెబ్ సీరీస్ చేయడానికి కూడా ఈ మిల్కీ బ్యూటీ ముందుకు వచ్చింది. ఈ సందర్భం లో తమన్నా తాజాగా ‘ఆహా’ ఓటీటీ ప్లేయర్ కోసం ఓ వెబ్ సీరీస్ చేస్తోంది.
ఇంతకముందు రాజశేఖర్ తో ‘గరుడ వేగ’ వంటి యాక్షన్ చిత్రానికి పనిచేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రదీప్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి ‘ఎలెవెంత్ అవర్’ (11th HOUR) అనే పేరును నిర్ణయించారు . దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే దీని స్ట్రీమింగ్ మొదలు కానుంది.
ఇదిలావుంటే ,కరోనా బారిన పడిన తమన్నా ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగులకు హాజరవుతోంది.