సినిమా :- మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

middle class melodies: సినిమా :- మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
నటీనటులు :- ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ
మ్యూజిక్ డైరెక్టర్:- స్వీకర్ అగస్తి, ఆర్‌హెచ్ విక్రమ్
డైరెక్టర్ :- వినోద్ అనంతోజు
కథ:-
ఈ కథ మొత్తం గుంటూరు అనే ఊరు మీద సాగుతుంది. హీరో రాఘవ (ఆనంద్ దేవరకొండ) ఒక మధ్య తరగతి జంటకు పుటిన సంతానం హోటల్ వ్యాపారం పెట్టుకొని జీవితం సాగిస్తుంటారు. మన హీరో రాఘవ మాత్రం హోటల్ పెడితే గుంటూరు లోనే పెడతాను అని పట్టుదలతో ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ , సంధ్య (వర్షా బొల్లామా) తో ఎప్పట్నుంచో ప్రేమలో ఉంటాడు. రాఘవ గుంటూరు లో హోటల్ పెట్టడానికి డబ్బులు లేకపోయినా ఏన్నొ కష్టాలు పడుతూ చివరికి గుంటూరు లో హోటల్ ప్రారంభిస్తాడు కానీ అనుకున్నది అనుకున్నట్లు జరుగుతే అది జీవితం ఎందుకు అవుతుంది? హోటల్ బిజినెస్ అసలు బాగా జరగదు. ఇది ఇలా ఉండగా సంధ్య వాలా నాన్న మంచి సంబంధం చూసి త్వరగా పెళ్లి చేసేయాలి అని పనిలో పడుతాడు. అసలు సంధ్య కు త్వరగా పెళ్లి చేసేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ విషయం తెలిసి రాఘవ ఎం చేసాడు? రాఘవ హోటల్ బిజినెస్ చివరికి ఎలా ముగిస్తుంది? సంధ్య రాఘవ కలుస్తారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే..
* ఆనంద్ దేవరకొండ మొదటి చిత్రం లో సరిగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం లో తాను పొందాల్సిన గుర్తింపు పొందేసాడు. వర్షా బొల్లామా నటన ప్రేక్షలులని మల్లి మల్లి చూసేలా చేస్తుంది.
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు.
* కధనం చక్కగా వ్రాసుకున్నారు.
* దర్శకుడు తాను చుపించాలనుకుంది ఎక్కడ తగ్గకుండా సైడ్ ట్రాక్ లేకుండా చూపించారు
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
* రొటీన్ స్టోరీ .
* ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేయాల్సింది.
ముగింపు :-మొత్తానికి ఈ చిత్రానికి సరదాగా సాగె టైంపాస్ చిత్రం. ఈ చిత్ర దర్శకుడు వినోద్ కె ఈ ఫలితం దక్కుతుంది. స్టోరీ పాతదే అయినా దర్శకుడు చిత్రీకరించిన విధానం ప్రసంశనీయం. కామెడీ ఎమోషన్స్ ఆనంద్ దేవరకొండ ని గుంటూరు స్లాంగ్ లో కొత్తగా చూపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. ఆనంద్ దేవరకొండ మొదటి చిత్రం లో సరిగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం లో తాను పొందాల్సిన గుర్తింపు పొందేసాడు. వర్షా బొల్లామా నటన ప్రేక్షలులని మల్లి మల్లి చూసేలా చేస్తుంది. అందరికంటే ఈ చిత్రం లో ఆనంద్ కి తండ్రి గా నటించిన వ్యక్తి ఎక్కువ మార్కులు కోటేస్తాడు. కెమెరా పని తీరు బాగుంది. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మోతనోకి ఈ వారం ప్రేక్షకులని అలరించడానికి ఈ చిత్రం వచ్చింది అని అనుకోవచ్చు..
middle class melodies రేటింగ్ :- 3/5