ఒక యువకుడి ట్వీట్ చుసిన షియోమీ యాజమాన్యం తనకి ఉచితంగా ఫోన్ పంపింది….ఏంటి ఆ ట్వీట్ !

ఇండియా లో షియోమీ ఫోన్లకున్న డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో , మధ్యతరగతి ప్రజలు అందుబాటులో ఉండడంతో భారత మార్కెట్ లో అగ్రగామిగా కొనసాగుతోంది.అయితే కమల్ అహ్మద్ అనే యువకుడికి షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్ ను ఉచితంగా అందించింది.ఎందుకంటే కమల్ అహ్మద్ షియోమీ ఫోన్లకు వీరాభిమాని.
ఇటీవలే షియోమీ కంపెనీ ఎంఐ 10టీ ప్రో ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది . ఆ ఫోన్ ను కొనేందుకు డబ్బులు పొదుపు చేసుకుంటున్నాడు కమల్ అహ్మద్. అలాగే కమల్… ఈ ఫోన్ ను కొనేవరకు తాను పెళ్లి చేసుకోనని ఫన్నీగా ట్వీట్ పెట్టాడు.
అయితే, ఈ ట్వీట్ ను చుసిన షియోమీ యాజమాన్యం తనకి వెంటనే అతడు కోరుకున్న లేటెస్ట్ మోడల్ ఫోన్ ను ఉచితంగా తన ఇంటికి పంపించింది. అనంతరం, షియోమీ ఇండియా అధిపతి మనుకుమార్ జైన్ మాట్లాడుతూ ‘ఇప్పుడిక నువ్వు పెళ్లికి సిద్ధం అనుకుంటా!’ అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఈ విషయం అంత నెట్టింట వైరల్ గా మారిపోయింది.