Metro Rail Heart Transplant: మెట్రో రైల్ లో గుండె తరలింపు
Metro Rail Heart Transplant: హైదరాబాద్లో మొట్టమొదటిసారి గుండెను తరలించారు. మెట్రో లో 21 కిలోమీటర్లు 43 నిమిషాల్లోనే గుండెను ఆసుపత్రికి చేర్చడం విశేషం.
నల్లగొండ జిల్లాకు చెందిన నర్సీ రెడ్డి(45) అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కామినేని హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో మృతుడి బంధువులు అవయవలను దానం చేయడానికి ముందుకొచ్చారు.
దీంతో కామినేని హాస్పిటల్ నుండి అపోలో హాస్పిటల్ కు గుండె తరలింపునకు గ్రీన్ ఛానల్ ను మెట్రో లో వైద్యులు ఏర్పాటు చేశారు. ఈ గుండె ను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించాలి. ఈ శాస్త్ర చికిత్స డాక్టర్ గోకులే ఆధ్వర్యంలో జరిగింది. నాగోలు చెక్ పోస్ట్ మధ్య 16 స్టేషన్లో ..21 కిలోమీటర్ల దూరం ఉంది. నాగోల్ నుంచి చెక్పోస్ట్ వరకు నాన్ జర్నీ అన్నమాట..
★ 4:30 PM గంటలకు కామినేని నుంచి గుండె తరలింపు
★4:37 PM నాగోల్ మెట్రో స్టేషన్ కు తరలింపు
★4:39 PM నాగోల్ లో మెట్రో స్టార్ట్ అయిన మెట్రో ట్రైన్
★5:10 PM జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకున మెట్రో
★ 5:13 PM అపోలో ఆస్పత్రికి చేరుకున్నా ఆంబులెన్స్
మెట్రోరైలు అధికారుల సహకారంతో గుండె తరలింపు సాధ్యమైంది .తొలిసారి హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించడం గొప్ప విషయం.