Mekasuri Movie(2020)

Mekasuri Movie:: సినిమా :- మేకా సూరి(2020)నటీనటులు :- అభినయ్, సుమయమ్యూజిక్ డైరెక్టర్:- సరోజానిర్మాతలు :- కార్తీక్ కాంచెర్లాడైరెక్టర్ :- తృణధ్ వెలిసిలా.
ఈ లాక్ డౌన్ సమయంలో వరుసగా విడుదలవుతున్న సినిమాలు మనం చుస్తున్నాం అలాగే వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం మేకా సూరి అనే సినిమా గురించి తెలుసుకుందాం..
కథ:
–ఈ కథ సూరి అనే గొర్రెల కసాయి ( అభినయ్ ) అనే వ్యక్తితో మొదలవుతుంది.అతని నివసించే ఊరిలో అతనిని మేకా సూరి అని పిలుస్తుంటారు. అలా కాలం సాఫీగా గడిచిపోతున్న సమయంలో సూరి రాణి ( సుమయ ) ప్రేమలో పడతాడు. రాణి తాను నివసించే ఊరిలో అప్పలనాయుడు అనే అతిపెద్ద కిరాయి గుండా దగ్గర పనిచేస్తుంది. అప్పల్ నాయుడుతో సహా ఊరిలో ఉన్న అందరూ రాణితో ప్రేమగా మాట్లాడుతూ సొంతం చేసుకోవాలనే ఆశతో ఉంటారు. కానీ రాణి మేకా సూరిని పెళ్లి చేసుకుంటుంది. ఆలా వారి ఇద్దరి జీవితం సాఫిగా సాగుతుంది అని అనుకునే లోపే రాణి అప్పలనాయుడుతో శారీరకంగా దగరవుతుంది. ఇది తట్టుకోలేక మేకా సూరి రాణితో గొడవ పడి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు. అతను తిరిగి వచ్చే సరికి రాణి చనిపోయి ఉంటుంది. అసలు రాణి అప్పలనాయుడుతో ఎందుకు శారీరకంగా దగ్గరైంది ? రాణిని ఎవరు చంపారు ? అసలు కథ ఏంటి ? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మేకా సూరి అనే సినిమా జీ5లో చూడాల్సిందే.
* అభినయ్ చక్కగా తన పాత్రలో జీవించాడు. అభినయ్ మరియు సుమయ నటన మిమల్ని కనువిందు చేస్తుంది. * మిగితా పాత్రలు కూడా కథకు న్యాయం చేశాయి. * డైరెక్టర్ సినిమా మొత్తాన్ని చాలా వొయిలెన్స్ తో చూపించాడు.* మ్యూజిక్ సినిమాకి తగ్గట్టు ఉంది. * కెమెరా పనితీరు చక్కగా ఉంది.* ఎడిటింగ్ కూడా బాగా చేశారు.
* రొటీన్ కథ .* ఎక్కువ రక్తపాతాలు అనవసరపు సన్నివేశాలు* నిర్మాణ విలువలు పెద్దగా కనిపించవు.
ముగింపు :-
మేకా సూరి అనే సినిమా మాస్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. అభినయ్ మరియు సుమయ నటన కనువిందు చేస్తుంది. మాస్ ప్రేక్షకులకి కావాల్సినవి డైరెక్టర్ సినిమాలో నింపేశారు. అవసరం లేకున్నా ఎక్కువ రక్తపాతాలతో సినిమా ఉంటుంది. మ్యూజిక్ సినిమాని ఇంకో మెట్టు ఎక్కిస్తుంది. డైరెక్టర్ రొటీన్ కథని తీసుకున్నా కథనాన్ని చక్కగా మలిచారు. మొత్తం మీద మేకా సూరి సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా నచుతుంది. మిగితా ప్రేక్షకులు అభినయ్ నటన కోసం అయితే ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ :- 2.75 /5