వకీల్ సాబ్ లో ఈ ట్విస్ట్ చూసి ఆశ్చర్య పోయాను…

vakeel saab movie release date : ప్రపంచమంతటా ఉన్న మన తెలుగువారు అందరు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ 3 సంవత్సరాల తరువాత వేడితెరపై కనిపించడానికి రెడీ అవుతుండటంతో పవన్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు. గతం లో పవన్ కళ్యాణ్ చేసిన మూవీ ‘అత్తారింటికి దారేది’ , ఈ సినిమా విజయం తరువాత పవన్ కి మరో హిట్ తగల లేదు. ఇంకా రాజకీయ కారణాలతో సినిమాలపై కూడా అంతగా ద్రుష్టి పెట్టలేదు .
ఇక ఇపుడు మనముందుకు ‘వకీల్ సాబ్’ పాత్రతో రాబోతున్నాడు. ఈ సినిమా బారి అంచనాలతో రాబోతుంది. ఈ మూవీ ఒకవేళ భారీ విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి కూడా తీరనుంది. ఫిలిం నగర్ నుండి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సినిమా అవుట్ పుట్ ఊహించిన దానికంటే ఎంతో బాగుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా మరోసారి పండగ వాతావరణం తీసుకురానుంది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న అభిమానులు థియేటర్స్ కి ఎంత హుషారుగా వస్తారో , థియేటర్స్ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు దానికి పదింతల హుషారుతో బయటికి వెళ్తారట .

ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమా ప్రివ్యూ ని మెగాస్టార్ చిరంజీవి చూశాడట. ఆ ప్రివ్యూ ని చుసిన మెగాస్టార్ ఆశ్చర్యపోయి, ఒక లాయర్ కథాంశం తో ఉన్న సినిమాను ఇంత అద్భుతంగా కూడా తీస్తారా అని , డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సినిమాని మలిచిన విధానం చూసి తనకి ఎంతో ముచ్చటేసింది అని , ఈ మూవీ, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆకలి తీరబోతుంది అని తెలిపారు. అలాగే నా తమ్ముడి అభిమానులకు ఒక పెద్ద పండగ రాబోతుంది అని , ఇంతగా కష్ట పడిన చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
మెగా స్టార్ చిరంజీవి,ఒక్క ఫిమేల్ సెంట్రిక్ మూవీ ని స్టార్ హీరోతో చేసి పొరపాటు చేస్తున్నారు ఏమో, అందులో దర్శకునికి కేవలం 2 సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఈ సినిమాను ఎలాతీస్తారేమో అని కొంచం బయంవేసిందని, కాని ఇపుడు చాల దైర్యంగా ఉన్నానని వెల్లడించాడు. అలాగే పవన్ కళ్యాణ్ వీరాభిమాని సినిమాను తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో ఆలా ఉందని కితాబు ఇచ్చాడు . నాకు కూడా వేణు శ్రీరామ్ తో కలిసి పని చేయాలనీ ఉందని అన్నాడు.

ఇపుడు దిల్ రాజు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఏప్రిల్ 3న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. దీనికోసం దిల్ రాజు ఏకంగా 2 కోట్ల వరకు కర్చు చేస్తున్నారని సమాచారం. ఎప్పటినుండో దిల్ రాజ్ కి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉండేది. దీనితో ఆ కోరిక తీరబోతుంది. దిల్ రాజు అభిమానుల రుచికి తగ్గట్టు సినిమాను తీసాడని చెబుతున్నాడు. ఈ రుచి అభిమానులకు ఎప్పటికి గుర్తుండి పోతుందని తెలిపాడు.
ఇక ఏప్రిల్ 3 వ తేదీన జరగబొయ్యే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ పండగకి మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా రాబోతున్నారట. ఇప్పటికే ప్రొమోషన్స్ ని ప్రారంభించిన దిల్ రాజు, ఏప్రిల్ 3న జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జరగనుంది. ఈ సినిమా ఏప్రిల్ 9 న బారి అంచనాలతో రాబోతుంది.