Megastar chiranjeevi in dual role – ద్విపాత్ర చేయడానికి సిద్ధమవుతున్న మెగా స్టార్:-

Tollywood Megastar chiranjeevi in dual role – అవును మీరు విన్నది నిజమే, అపుడెపుడో ముగ్గురు మొనగాళ్లు సినిమా నుంచి మొన్న వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా వరకు చిరు డ్యూయల్ షేడ్స్ లో కనిపిస్తే ఫాన్స్ కి పూనకాలే అని చెప్పాలి.
చిరు కి డ్యూయల్ కాదు అంత కంటే ఎక్కువ పాత్రలు ఇచ్చిన తనదైన శైలితో ఇచ్చిపడేస్తాడు. అలంటి మెగా స్టార్ చాలా సంవత్సరాల క్రితం తండ్రి కొడుకు పాత్రలో రెండు సినిమాలలో కనిపించారు. అదే స్నేహం కోసం మరియు అందరివాడు. ఈ రెండు సినిమాలో తండ్రిగాను , కొడుకుగాను చిరు చేసిన రచ్చ అంత ఇంత కాదు.
ఇపుడు చిరు తీస్తున్నా ఆచార్య సినిమా తర్వాత చెయ్యబోయే
సినిమాలలో ఒకటి దర్శకుడు బాబీ తో ఉండబోతుంది.
అయితే బాబీ కి కూడా ద్వీపాత్ర సినిమాలు చేయడం ఇష్టమే. పవర్ సినిమాతో రవితేజ ని డ్యూయల్ షేడ్స్ లో చూపించి బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసింది. ఇదిలా ఉండగా బాబీ చిరుకు రాసుకున్న కథలో చిరుని తండ్రి మరియు కొడుకుగాను పవర్ఫుల్ పాత్రలలో చూపించబోతున్నారు అని విశ్లేష వర్గాలు తెలుపుతున్నాయి.
ఇదే కనుక నిజం అయితే సినిమా రిలీజ్ రోజు రచ్చ మాములుగా ఉండదు అని అర్ధం అవుతుంది.