Tollywood news in telugu

Mega Star Bholashankar Movie Spicy Updates : మెగాస్టార్ భోళాశంకర్ సినిమా ముహూర్తం ఫిక్స్ :-

Mega Star Bholashankar Movie Spicy Updates

Mega Star Bholashankar Movie Spicy Updates : మెగాస్టార్ చిరంజీవి గారు వరుస భారీ సినిమాలు లైన్ లో పెట్టుకొని అన్ని ఒకేసారి చిత్రీకరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి లో చిరు , చరణ్ కలిసి నటించిన ఆచార్య విడుదలకు సర్వం సిద్ధం అయింది.

అయితే ఆచార్య సినిమా షూటింగ్ అయిపోయి విడుదలకు సిద్ధం అవ్వడంతో చిరు వెంటనే ఆలస్యం చేయకుండా మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా అయినా లూసీఫర్ రీమేక్ పనిలో బిజీ అయిపోయారు. ఈ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తవకముందే చిరు మెహెర్ రమేష్ కాంబినేషన్ లో చేసే సినిమా ముహూర్తం మరియు షూటింగ్ మొదలుపెట్టే తేదీని అనౌన్స్ చేసారు. ఈ సినిమా ముహూర్తం నవంబర్ 11 న ఘనంగా జరగబోతుండగా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలుకానుంది.

ఈ భోళాశంకర్ సినిమాలో చిరు సరసన ఎవరు నటించబోతున్నారనేది సస్పెన్స్ గా పెట్టిన , చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా తమిళంలో అజిత్ బ్లాక్ బస్టర్ సినిమా అయినా వేదాళం రీమేక్.

ఈ సినిమాని మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా , రామబ్రహ్మం సుంకర గారు నిర్మిస్తున్నారు. మొత్తానికి రెండు రీమేక్ సినిమాలు ఒకేసారి చిత్రీకరించి 2022 లో అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు చిరు సిద్ధమయ్యారని అనిపిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button