Mega Films Taking Charge in December : డిసెంబర్ నెల మెగా అభిమానుల జాతర :-

Mega Films Taking Charge in December : ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం ఆయింటది. డిసెంబర్ నెలలో మెగా అభిమానులకి జాతరే , అదెలా అనుకుంటున్నారా..ఒకే నెలలో మెగా ఫామిలీ కి సంబంధించి 3 సినిమాలు రావడం. ఇంతకంటే ఒక మెగా అభిమాని ఎం కోరుకుంటాడు.
ఎలాగో జనవరి లో సంక్రాతి బరిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా అభిమానులని ఊరమస్ మాస్ లుక్ తో కనువిందు చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది.
అయితే దీనికంటే ఒకే నెల ముందే చిరంజీవి , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , వరుణ్ తేజ్ సినిమాలు థియేటర్ లో దర్శనం ఇయ్యబోతున్నాయి.
ఇప్పటికే బన్నీ చేస్తున్న పుష్ప ది రైజ్ పార్ట్ 1 క్రిస్మస్ కానుకగా విడుదల అవ్వబోతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే చిరు , రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య కూడా ఆ సమయానికి రావడం అభిమానులకి డబల్ ధమాకా అయినట్లు అనిపించగా..
ఇపుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించబోతున్న ఘనీ అనే చిత్రం కూడా ఆ సమయంలోనే రాబోతుందని సమాచారం. కాబట్టి ఒకే నెలలో, ఒకే వారం లో నలుగురు మెగా హీరోలు అభిమానులకు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి కనువిందు చేయనున్నారు. చూడాలి మరి ఈ క్రిస్మస్ సమయాన ఏ రేంజ్ హుంగామ ఉండబోతుందో.