News

medaram jatara 2021 dates : ఈ రోజునుండి ప్రారంభమైన చిన్న మేడారం జాతర..

medaram jatara 2021 dates

Mini Medaram 2021 Dates: సమ్మక్క సారలమ్మ చిన్న మేడారం జాతర తేదీలను పూజారులు విడుదల చేసారు. ఈ రోజు  ఫిబ్రవరి 24 నుంచి 27 వ తేదీ వరకు   అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈ జాతర  పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక అసలైన సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాల ఒకసారి జరిగే విషయం మన అందరికి తెలిసిందే.

సంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరం  మండమేలిగే పండగ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పూజారులు  ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ చిన్న  మేడారం మండమేలిగే పండుగ సందర్భంగా అమ్మవార్ల గద్దెపైకి రారని సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ వెల్లడించారు.

పూజా విధివిధానాలు ఇలా ఉన్నాయి.

* ఈ రోజు ఫిబ్రవరి 24 బుధవారం గుడిని శుభ్రపరచడం, పలు  పూజాకార్యక్రమాలు  నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు  ఉదయం గ్రామ నిర్భంధన ఉంటుంది.

* తదుపరి రోజు 25 గురువారం సమ్మక్క, సారాలమ్మ లకు పసుపు, కుంకుమ లతో పూజిస్తారు.

* ఆ తరువాత రోజు 26 శుక్రవారం నాడు భక్తులు అమ్మవార్లను  దర్శించుకొనుట జరుగుతుంది.

* ఇక చివరి రోజు 27 శనివారం నాడు అమ్మవార్ల పూజ కార్యక్రమాలు ముగింపుతో చిన్న  జాతర పూర్తీ అవుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button