Tollywood news in telugu
ఫ్యాన్స్ లో ఆనందం నింపిన విజయ్ !

master teaser: కోలీవుడ్ లో విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాల రోజులక్రితం పూర్తీ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా సినిమాని రిలీజ్ చేయలేదు.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ దివాలీకి ‘మాస్టర్ ‘సినిమా టీజర్ విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఈ న్యూస్ విన్న అభిమానులు ఎగిరి గంతులువేస్తున్నారు. చాల రోజుల తరవాత వారి అభిమాన హీరో విజయ్ సినిమా అప్ డేట్ న్యూస్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఈ మధ్యన విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే టాక్ బయటికి రావడంతో, ఈ ఆలోచనలనుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ సినిమా అప్ డేట్ ఇచ్చాడేమో అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.