Tollywood news in telugu

Master Movie Release date : విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల…రిలీజ్ డేట్ ఎప్పుడంటే !

Master Movie in OTT

Master Movie in OTT : విజయ్ హీరోగా,  దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. మాళవిక మోహనన్, ఆండ్రియా జర్మియా హీరోయిన్లుగా నటించిన ఈ సినమకు అనిరుధ్‌ రవిచంద్రన్ బాణీలు సమకూర్చారు.

సంక్రాంతి కానుకగా పలు భాషల్లో జనవరి 13న రిలీజ్ ఐ ప్రేక్షకాదరణ పొందింది. రిలీజ్ అయిన ప్రతీ సెంటర్‌లోనూ విజయవంతంగా ఆడుతూ నిర్మాతలకు కాసుల వర్షంతో ముంచెత్తుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ‘మాస్టర్’ మూవీ దాదాపు రూ.150 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఇపుడు ఈ సినిమా  తాజాగా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైనట్లు వార్తలు వినపడుతున్నాయి.  ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘మాస్టర్’ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు  సమాచారం.

అదేవిదంగా ఈ సినిమా  వచ్చే నెల 13న  అమెజాన్ ప్రైమ్ వీడియో‌లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సిఉంది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button