Tollywood news in telugu

Mass Maharaja Raviteja turned as Ravanasura : రావణాసుర గా మాస్ మహారాజ :-

Mass Maharaja Raviteja turned as Ravanasura

Mass Maharaja Raviteja turned as Ravanasura : ఏంటో ఈ మధ్య మాస్ మహారాజ రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నట్లు ఉన్నారు. వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ వారి అభిమానులకు డబల్ కాదు ట్రిపుల్ కాదు ఏకంగా మాస్ బిర్యానీ రేంజ్ లో అర డజన్ సినిమాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన జరిపారు.

ఆ 6 సినిమాలలో అభిమానులు ఎంతగానో ఆశక్తి చూపిస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అందులో ముందంచువరుసలో రవితేజ 70 వ సినిమా అదేనండి కాన్సెప్ట్ సినిమాలకి కేర్ అఫ్ అడ్రస్ అయినా సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చే సినిమా. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించాక అభిమానులకు పోస్టర్ చూడగానే పూనకాలే వచ్చేసాయి.

రావణాసుర టైటిల్ తో పోస్టర్ మీద రవితేజ 10 డిఫరెంట్ షేడ్స్ లో చుపియడం రవితేజ సినిమాలలో ది బెస్ట్ గా నిలిచిపోయేలా చేసారు పోస్టర్ తోనే. ఈ పోస్టర్ తోనే సినిమా మీద హైప్ ట్రిపుల్ అయ్యిందనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. ఒక రవితేజ అభిమానులకే కాదు సగటు సినిమా లవర్ కి కూడా ఎంతగానో అలరించింది.

త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఈ సినిమాలో రవి సరసన ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పటికి సస్పెన్స్ గానే పెట్టారు చిత్రబృందం. సుధీర్ వర్మ ఎప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తో వస్తారని తెలుసు కానీ ఇంత వెరైటీ గా పోస్టర్ తోనే ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేయడం బహుశా ఇదే మొదటిసారి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టించబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button