movie reviews

మసక్కలి మూవీ రివ్యూ

నటీనటులు : సాయి రోనాక్, శ్రావ్య, శిరీష వంక, కాశి విశ్వనాథ్, దేవదాస్ తదితరులు

సంగీతం : మిహిరామ్స్

సినిమాటోగ్రఫీ: సుభాష్ దొంతి

ఎడిటింగ్ : శివ శర్వాని

దర్శకత్వం : నబి ఏనుగుబాల

నిర్మాతలు : నమిత్ సింగ్

సాయి రోనాక్, శ్రావ్య హీరో హీరోయిన్స్ గా కొత్త దర్శకుడు నబి ఏనుగుబాల తెరకెక్కించిన చిత్రం masakkali. వినాయకచవితి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను   ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం .

కథ :

సూర్య (సైక్రియాట్రిస్టు స్టూడెంట్) ఆకాంక్ష (శిరీష ) అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. ఆమెను కలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అనుకోకుండా ధనవంతురాలైన శృతిని కలుస్తాడు సూర్య. శృతి పొగరు పట్టిన అమ్మయిలా బిహేవ్ చేస్తూనే మనీకి వాల్యూ ఇస్తూ మరో పక్క సమాజ సేవ చేస్తుంటుంది. అసలు శృతికి ఉన్న ప్రాబ్లం ఏంటి?? చివరికి శృతి కథ ఏమైంది ? మరి సూర్య , ఆకాంక్ష కలుసుకున్నారా ? అనేదే మిగితా కథ.

విశ్లేషణ:

ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమాని తీయాలి అనుకున్న దర్శకుడు మాత్రం స్క్రీన్ ప్లే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. masakkali లో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా చెప్పుకునేలా లేదు. ఒక రొటీన్ స్టోరీని గొప్పగా చూపించకపోగా కనీసం రొటీన్ గా కూడా స్క్రీన్ పై కనిపించదు. అర్ధం లేని పాత్రలు విసుగుతెప్పించే డైలాగ్స్ ఇలా అన్ని విషయాలల్లో దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మొత్తంగా సినిమా పూర్తి నిరాశనే మిగులుస్తుంది.

నటీనటులు:

హీరోగా నటించిన సాయి రోనక్ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. శిరీష కూడా తన పాత్రకు తగ్గట్టుగా కనిపిస్తుంది. శ్రావ్య ఒకే అనిపించింది. సీనియర్ నటుడు కాశి విశ్వనాద్ సూర్య తండ్రి పాత్రలో బాగా నటించాడు. నవీన్ ఉన్నంతలో కాస్త నవ్వించాడు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు నబి ఏ మాత్రం కొత్తగా ప్రేక్షకులకు చూపించలేకపోయాడు. సినిమా చాలా చోట్ల విసుగుతెప్పిస్తూ సాగుతుంది. సుభాష్ దొంతి ఛాయాగ్రహణం బాగుంది. నమిత్ సింగ్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. శివ శర్వాని ఎడిటింగ్ పర్వాలేదు. మిహిరామ్స్ సంగీతం సోసో గా వుంది. మూడు పాటల్లో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోదు.

ప్లస్ పాయింట్స్ :

చెప్పేందుకు ఏమి లేవు

మైనస్ పాయింట్స్:

ఈ ఒక్కటి అని చెప్పలేము, చాలా ఉన్నాయి

తీర్పు :

మొత్తంగా ఈ masakkali మూవీ చూడడటం కోరి తలనొప్పిని తెచ్చుకోవడమే అని చెప్పాలి.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button