Today Telugu News Updates
మర్యాద రామన్న సినిమా యాక్టర్ కరోనా తో మృతి !
Maryada ramanna actor died

Maryada ramanna actor died :: కరోనా విలయ తాండవం చేస్తూ చాల మందిని బలికొంది , ఎన్నో దగ్గర సంబంధాలను దూరం ఇంకా దూరం చేస్తూనే ఉంది , సినిమా ఇండస్ట్రీ లో కుడా చాల మంది కరోనా పడి కోలుకున్నారు , కానీ వేణుగోపాల్ కోసూరి కరోనా బారిన పడి మరణించాడు , ఈ విషయం సినీ ఇండస్ట్రీ ని బాధించింది .
హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఒక ప్రైవేట్ హాస్పత్రిలో 20 రోజులుగా చికిత్స తీసుకుంటూ సెప్టెంబర్ 23 న తిరిగిరాని లోకానికి వెళ్ళాడు , ఇతను ఎక్కువగా రాజమౌళి దర్శకత్వంలో నటించాడు , మర్యాద రామన్న, విక్రమార్కుడు , చలో లాంటి సినిమాల్లో నటించాడు , దాదాపు 30 సినిమాల వరకు నటించాడు .
ఇతని స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, FCI (ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ) లో మేనేజర్ గా చేసి రిటైర్డ్ అయ్యాడు , ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు .