Tollywood news in telugu

మారుతి మాయలో గీత గోవిందుడు పడతాడా??

చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మొదట నటించి తరువాత “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించిన vijay devarakonda “పెళ్లిచూపులు” మూవీ ద్వారా తొలిసారి హీరోగా నటించి తన టాలెంట్ ని తెలుగు ప్రేక్షకులకి రుచి చూపించాడు. ఆ తరువాత  వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా తెలుగులో ముఖ్యంగా యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో తన సక్సెస్‌ రేటును పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుదల అయిన గీత గోవిందం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అర్జున్ రెడ్డి లైఫ్ టైమ్ కలెక్షన్లను పది రోజుల్లోనే గీత గోవిందం మూవీ దాటేసింది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న నోటా మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. నోటా కాకుండా vijay devarkonda నటిస్తున్న మరో రెండు సినిమాలు డియర్ కామ్రేడ్, టాక్సీవాలా ఇవి కూడా షూటింగ్ చేసుకుంటున్నాయి.

Read  నాలుగు సార్లు హిట్ కొట్టిన ఈ జంట... ఒకటి కానుందా !

దీనికి తోడు గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరో అయిపోవడంతో స్టార్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు విజయ్ డేట్స్ కోసం వెంట పడుతున్నారు. ప్రస్తుతం మరో మూడు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు విజయ్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తుండగా తాజాగా మరొక దర్శకుడు మారుతి పేరు కూడ vijay devarakonda డైరెక్ట్ చేయబోయే దర్శకుల జాబితాలో చేరినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ ఈ తరం దర్శకుల్లో ఎంటర్టైనర్ మూవీస్ తీసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి తన తర్వాతి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయాలని ఆశ పడుతున్నట్లు సమాచారం. దర్శకుడిగా మారుతీ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నానితో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బ్లాక్ బస్టర్ తీసి టాలీవుడ్ లో తన రేంజ్ ని పెంచుకున్నాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, శర్వానంద్ లాంటి హీరోలతో సినిమాలు చేసాడు. మారుతి డైరెక్ట్ చేసిన ‘మహానుభావుడు’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు నాగచైతన్య హీరోగా ‘శైలజా రెడ్డి అల్లుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మారుతి. సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న విషయo తెలిసిందే.

Read  విజయ్ దేవరకొండ పై విమర్శలు...!

మారుతితో సినిమా చేయడానికి విజయ్‌కి కూడా ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. మారుతి-విజయ్ కాంబినేషన్లో సినిమా తీయడానికి గీతా ఆర్ట్స్ సంస్థ కూడా రెడీగా ఉంది. కానీ విజయ్ దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ విషయంలో కన్ఫర్మేషన్ రాకపోవడం వల్లే మారుతి ఇంకా తన తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు. అంటే మారుతి దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావాలంటే ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button