Tollywood news in telugu

రివ్యూ: మార్షల్

సినిమా: మార్షల్
నటీనటులు: అభయ్, శ్రీకాంత్, మేఘా చౌదరి, రష్మి సమాంగ్, సుమన్,వినోద్ కుమార్,శరణ్య, పృద్విరాజ్, రవి ప్రకాష్, ప్రియ దర్శిని రామ్, ప్రగతి,కల్ప వల్లి,
సుదర్శన్, తదితరులు సంగీతం: యాదగిరి వరికుప్పల
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి
ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,
మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,
ఫైట్స్ : నాభ మరియు సుబ్బు
ఎడిటర్ : చోట కె ప్రసాద్,
పాటలు : యాదగిరి వరికుప్పల,
కళా దర్శకుడు : రఘు కులకర్ణి,
డాన్స్ మాస్టర్ : గణేష్
ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ
నిర్మాత : అభయ్ అడకా

కథ:
సూపర్‌స్టార్ శివాజీ (శ్రీకాంత్)కి, అభయ్(అభయ్ అడక) చాలా పెద్ద ఫ్యాన్. కెరీర్ పరంగా ఒక మెడికల్ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తుంటాడు అభయ్. అతనికి అక్క(శరణ్య ప్రదీప్) అంటే ప్రాణం. అయితే, ఆమెకి పిల్లలు పుట్టరు. అందుకే ఆమె, ఆమె భర్త కలిసి కోయల్ హాస్పిటల్‌లో ఫెర్టిలిటీ చికిత్స అందుబాటులో ఉంది అని తెలిసి వెళతారు. అక్కడ చికిత్స చేయించుకుంటుండగా అభయ్ అక్క కోమాలోకి వెళ్ళిపోతుంది.

అదే టైమ్‌లో అభయ్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న కంపెనీ ద్వారా అతను డిస్ట్రిబ్యూట్ చేసిన బ్యూటీ పిల్స్ వేసుకున్న వాళ్లలో ఇద్దరు చనిపోతారు. మరికొంతమంది అస్వస్థతకి గురి అవుతారు. దీనంతటికి కారణం ఒక సైంటిస్ట్ చేస్తున్న ఆపరేషన్ ‘మార్షల్’ అనే ప్రయోగం, ఆ సైంటిస్ట్ సూపర్ స్టార్ శివాజీ అని రివీల్ అవుతుంది. అసలు సినిమా హీరో సైంటిస్ట్ అవ్వడం ఏంటి?, ఆపరేషన్ ‘మార్షల్’ అనేది దేనికి సంబంధించింది?, దీన్ని అంతటిని హీరో ఎలా కనుక్కున్నాడు, ఎలా ఛేదించాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మార్షల్ సినిమా మొదటిసగం పాత్రల పరిచయం, సినిమా మెయిన్ థీమ్ ఉంటుంది. సెకండాఫ్‌లో అసలు విషయం ఏంటి అనేది రివీల్ చేస్తారు. ఆ రివీల్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. కథలో ఒక మంచి పాయింట్ ఉన్న దాన్ని చెప్పాల్సిన, చెప్పాలనుకున్న డెప్త్‌లో ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో హీరోలు అభయ్, శ్రీకాంత్ లు పోటీ పడి నటించారు. శ్రీకాంత్ ను సినిమాలో విలన్‌గా పరిచయం చేసారు కానీ, మళ్ళీ చివరికి వచ్చేసరికి సింపతీ కోసం ఆ పాత్రని చంపేసి మంచివాడిగా చూపించడం జరిగింది. ఆ చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంది.

అయితే శ్రీకాంత్ ముందు చెడ్డవాడిగా ఉండడానికి కారణం కానీ, తరువాత మంచివాడిగా మారడానికి రీజన్ ను ఇంకాస్త ఎలివేటెడ్ గా చూపించి ఉంటే బాగుండేది. నిజానికి ఫ్లాష్ బ్యాక్ ప్రకారం చూస్తే శ్రీకాంత్‌ది పాజిటివ్ క్యారెక్టర్. కానీ, సినిమాలో నెగెటివ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఆ రెండు లేయర్స్ మధ్య బ్యాలన్స్ బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు.

సినిమాలో శ్రీకాంత్ నటన ఆకట్టుకుంటుంది. స్టైలింగ్ నుండి లుక్ వరకు చాలా కేర్ తీసుకున్నారు. అయితే శ్రీకాంత్‌ని ఎదిరించే హీరో పాత్రలో అభయ్ నటన సినిమాకు హైలెట్. తన ఎంట్రీకి మంచి కథ రెడీ చేసుకున్న అభయ్ అందులో నటించి మెప్పించడానికి హీరోగా మాత్రం పూర్తిగా ప్రిపేర్ అయ్యాడు. అతని ఫిజిక్ గానీ, నటన కానీ హీరోకు ఏమాత్రం తగ్గకుండా చక్కగా ఉన్నాయి. పైగా అతని చుట్టూ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ పాత్రలకు కూడా వెయిట్ ఉండడంతో అభయ్ ఇంకా బాగా నటించాడు. సినిమాల మీద ఫ్యాషన్ ఉంది కాబట్టి తన తరువాతి సినిమాల్లో అభయ్ తన నటన ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడు.

హీరోయిన్‌గా పరిచయమైన మేఘా చౌదరికి పెర్ఫార్మెన్స్ చెయ్యడానికి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సినిమాలో సీన్స్‌లో కంటే ఆమె పాటల్లోనే ఎక్కువసేపు కనిపించింది. కాస్త గ్లామర్ డోస్ కూడా రుచిచూపించింది. సుమన్, ప్రగతి, పృథ్వి, ప్రియదర్శిని రామ్, రవి‌ప్రకాష్ లాంటి సీనియర్ నటీనటులు వారి పరిడీమేరకు నటించి మెప్పించారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించి వాటిని బాగా పోషించారు. సుదర్శన్ లాంటి వాళ్ళు నవ్వించడానికి ట్రై చేసారు. కానీ, ఆ సన్నివేశాల్లో ఈజ్ ఉండడంతో ఆ కామెడీ సీన్స్ బాగా వచ్చాయి.

‘మార్షల్’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన జైరాజా సింగ్ ఎంచుకున్న పాయింట్ మీద చాలా వర్క్ చేసాడు అని అర్థమవుతుంది. అతను అనుకున్న దాన్ని కంటే బాగా ప్రజెంట్ చేసాడు. ఎఫెక్టివ్‌గా స్క్రీన్ మీదకి చూపించాడు. సరోగసీ విధానంలో బిడ్డలను కనడం, ఆ నేపథ్యంలో రాసుకున్న సీన్స్ కాస్త ఆసక్తి రేకెత్తిస్తాయి. కానీ, హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్, శ్రీకాంత్ చెడ్డవాడి నుండి మంచివాడిగా మారే కీలకమైన సీన్స్ ఆలోచింపజేస్తాయి.

అయితే ఎక్కడా కథలో మాత్రం క్లారిటీ మిస్ అవ్వలేదు. మొదటిసారి డైరెక్షన్ చేసినా సినిమాలో ఎక్కడా జంప్స్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచమైన పాటల రచయిత వరికుప్పల యాదగిరి పర్లేదు అనిపించాడు. ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ అందించిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ బావుంది.

ఓవరాల్‌గా చూస్తే ఒక కొత్త పాయింట్‌ని ఎఫెక్టివ్‌గా చెప్పాలని ‘మార్షల్’ టీమ్ చేసిన ప్రయోగం అభినందించదగ్గదే. కథని నమ్ముకుని ధైర్యంగా చాలా ఖర్చు పెట్టారు. ‘మార్షల్’ ప్రయోగం పరంగా పర్లేదు, కానీ ఆ సినిమాలో శ్రీకాంత్ ప్రయోగం సక్సెస్ అయినట్టుగా ఈ సినిమా పూర్తిగా విజయవంతం అయ్యిందని చెప్పవచ్చు.

చివరిగా: కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మార్షల్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్: 3.25/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button