Today Telugu News Updates
పండుటాకుల రాలిన … పన్నెండేళ్ల ప్రేమ..! కలిసికట్టుగా ఆత్మ హత్య

వారి మధ్య ప్రేమ పన్నెండు సంవత్సరాల క్రితం మొదలైంది, వారి ప్రేమ చిగురుటాకులా మొదలై…పండుటాకులా రాలిపోయింది. ఈ దారుణమైన సంఘటన బెల్లంపల్లి లోని శుభాష్ నగర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే శుభాష్ నగర్ లో ఉంటున్న మల్లేష్ కుమార్(36), బాబు క్యాంపు బస్తీ కి చెందిన నర్మదా(28) లు 12 సంవత్సరాలుగా పెద్దలకు తెలియకుండా వారి ప్రేమ కొనసాగుతూ కొన్ని నెలలక్రితం పెళ్లి జరిగింది. పెళ్ళి జరిగిన సంతోషము మరువకముందే వారిని ఎదో తెలియని జబ్బు కబళించింది. ఆ బాధ భరించలేక తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్నీ మెసేజ్ ల రూపంలో వారి స్నేహితులకు తెలిపి, ఆ దంపతులిద్దరూ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ విషయం వారి కుటుంబసబ్యలకు తెలవగానే హుటాహుటిన చెరువు వద్దకు పరిగెత్తగ ఆ లోపే ఆదంపతులిద్దరు తిరిగిరానిలోకాలు వెళ్లిపోయారు.