today horoscope

Monthly Horoscope: ఈ మార్చిలో 12 రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…

జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిష్యసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

Monthly Horoscope

మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)..

ఈ రాశివారికి ఈ  మాసంలో వృత్తిపరంగా అనుకూలమైన  ప్రయోజనాలు కలుగుతాయి.  మీకు అభివృద్ధి మార్గాలు చేతికందుతాయి. చాల రోజులుగా  పెండింగులో ఉన్న  పనులును పూర్తి చేసుకొనే దారి కనపడుతుంది. అదేవిదంగా మీకు వచ్చే లాభాలకు తగట్టు  ఈ నెలలో విపరీతంగా ఖర్చు చేస్తారు. కావున  ఖర్చు చేసేటపుడు తగిన  జాగ్రత్తలు తీసుకోవాలి.  మీ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలలో మాట్లేడేటపుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. లేదంటే విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.  ఆస్తికి సంబంధించి  కొనుగోలు లేదా అమ్మకాలు జరిపేటపుడు తొందరపాటు  నిర్ణయాలు పనికిరావు. మీ కన్న తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.  పెళ్లి కాని వ్యక్తులు, వారి విషయాలను  ఇష్టమైన వారితో పంచుకుంటారు.  ఫలితంగా ఇది నూతన సంబంధాలకు తోడ్పడుతుంది.

​వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)..

వీరికి ఈ నెల చాల కలిసివచ్చే సందర్భాలు ఎదురవుతాయి. ఫలితంగా విజయం సాధిస్తారు. అదేవిదంగా దృఢ నిశ్చయంతో ఉంటారు. కాబట్టి మీకు పోటీగా ఉండేవారిపై పైచేయిగా నిలుస్తారు. దీని మూలంగా కొంతమంది ప్రత్యర్ధులు పుట్టుకొస్తారు.  వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు గడిస్తారు.  మీ భాగస్వామితో క్రమం తప్పకుండా మీ మనస్సులోని మాటలను పంచుకుంటూ ఉంటారు. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో కలిసివస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఎదుటివారితో ఇబ్బందులు ఏడుకొంటారు.  ఇది మీకు కొన్ని  సమస్యలను తెచ్చిపెడుతుంది.  వీలైనంత వరకు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.  వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

​మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)..

ఈ నెలలో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి , అక్కడ ఉద్యోగం సాధించడానికి కొత్త  అవకాశాలు లభిస్తాయి.  పెట్టుబడులను పెట్టేముందు బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మొదటికే మోసం జరుగుతుంది. భవిష్యత్తులో మీ లక్ష్యాల ను చేరుకోడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఎదుటివారితో గొడవలకు తావివ్వకండి. సుఖజీవితం ఉంటుంది.  మీ జీవిత భాగస్వామితో వాదనలు పెట్టుకోకండి.  లేకుంటే మనశ్శాంతిని కోల్పోతారు. ఈ మార్చ్ నెలలో  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. నిద్రలేమి, చిన్నచిన్న విషయాలు ఆందోళన కలిగిస్తాయి.

​కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)..

వీరు లక్ష్యాలను అంచనావేసి ముందుకు సాగుతాయి. ఫలితంగా విజయాలు వెన్నంటి ఉంటాయి. అదేవిదంగా మిగిలిన వారికీ ఆదర్శంగా నిలుస్తారు.  మీ కార్యాలయంలో లక్ష్యాలను సాధించడానికి మీరు ఇతరులతో కలిసి చురుకుగా పాల్గొంటారు.  సహోద్యోగులు, ఉన్నతాధికారుల దగ్గరి నుండి గౌరవం లభిస్తుంది.  వ్యాపారవేత్తలకు , కాంట్రాక్టర్లకు ఈ మాసం చాల బాగుంది. ఇది అపారమైన నగదు ను పొందుతారు. ఫలితంగా బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యవిషయములో ఎలాంటి ఇబ్బందులు కలగవు.

​సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)..

ఈ రాశివారికి ఈ నెలలో అనుకున్న పనులు, కోరికలు తీరుతాయి.  మీ సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉంది.  వృత్తిపరమైన రంగానికి సంబంధించి అనుకూలమైన అవకాశాలను పొందుతారు.  ఆర్థిక విషయాలు సాఫీగా సాగుతాయి.  మీ అభిప్రాయాన్ని తెలియజేసేటప్పుడు జాగ్రత్త వహించండి. లేకుంటే అసంతృప్తి కోల్పోతారు.  మీలో కొంతమంది ఆస్తి, రియల్ ఎస్టేటుకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. వివాహ జీవితానికి సంబంధించి గతంలో సమస్యలు ఇప్పుడు తీరుతాయి.  విద్యార్థులకు చదువు విషయంలో అనుకూలంగా ఉంటాయి.  ముఖ్యమైన విషయాలపై మీ తోబుట్టువులతో మీకు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. బంధాలను కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంటుంది.

​కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వీరికి ఈ నెలలో కష్టపడటం వల్ల  ఆశించిన ఫలితాలు  చేకూరుతాయి.  వృత్తి పరంగా విజయం దక్కుతుంది. మీకు అనుకోకుండా  డబ్బు చేతికందుతుంది. ఫలితంగా  లాభాల బాట పాడుతారు.  అయితే కొన్ని సమయాల్లో మీరు మీ మాటలకు కట్టుబడి ఉండకపోవడం వల్ల  ఘర్షణకు కారణం అవుతాయి.  వ్యక్తిగతంగా మీ తండ్రితో విభేదాలు ఇంటి వాతావరణాన్ని పాడుచేస్తాయి. కాబట్టి మీ మాటలను  నియంత్రణలో పెట్టుకోండి.  విలువైన వస్తువులు  జాగ్రత్తగా దాచుకోండి.  ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. లేదంటే  ఖర్చులు పెరిగి ఒత్తిడికి లోనవుతారు.  మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేస్తారు.

​తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశి వారికీ ప్రత్యర్థుల నుండి ఆటంకాలు తలెత్తుతాయి. కావున  మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  మీరు ఉద్యోగాలను మార్చడానికి సిద్ధంగా ఉంటారు. కానీ త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.  మీ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కష్టపడాలి.  తద్వారా మీరు భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుంది. మంచి ఉద్యోగం పొందుతారు.  వ్యాపార భాగస్వామితో స్పష్టంగా ఉండటం మంచిది. లేదంటే అపార్థాలకు గురిఅవుతారు.  చిన్న తరహా పారిశ్రామిక వేత్తలకు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశముంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండండి. ఇదే సమయంలో మీ ఇద్దరి మధ్య కొంత అపార్థం తలెత్తే ప్రమాదం ఉంది.

​వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

వీరు ఈ నెలలో ఆగిపోయిన పనులు  పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో పదొన్నతులు పొందే అవకాశముంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి  ఈ నెల బాగుంటుంది. వ్యాపారంలో మీకు అనుభవం ఉండటంతో లాభాలను గడిస్తారు.  మీ వైవాహిక జీవితంలో సవాలు చేసే విషయాలు ఎదుర్కొంటారు. ఫలితంగా కొన్ని  మీ కుటుంబంలో  సమస్యలను కలిగిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రెండవ  వివాహం చేసుకోవాలనుకునేవారికి అనుకూలమైన సమయం . కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

​ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశి వారికీ ఎదురయ్యే  అడ్డంకులను దాటుతారు. అదేవిదంగా  మీరు శత్రువులను అధిగమించగలుగుతారు. సహోద్యోగులతో కొన్ని వివాదాలు తలెత్తి  పనిభారం పెరిగే అవకాశముంది. ఉద్యోగాలు మారాలనుకొనే వారికీ  ఇది అనుకూలమైన సమయం. ఆకస్మిక ఖర్చులు సంభవించే అవకాశముంది. వివాహితులు తమ పిల్లలు ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ఆందోళన పడాల్సి రావచ్చు.  విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందడానికి  ఎక్కువ కష్టపడాల్సిన సమయం ఇది. ఆరోగ్యవిషయములో జాగ్రత్తలు పాటించాలి.

​మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వీరికి ఈ నెలలో ఆర్థికంగా బాగుంటారు. ఫలితంగా అనుకున్న పెండింగ్ పనులు పూర్తీ చేస్తారు.  మీ  కెరీర్ ను మెరుగుపరిచే క్రమంలో  ప్రశంసలు పొందే అవకాశముంది. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ఈ నెల అధిక మొత్తంలో సంపాదిస్తారు.  మీరు ఆస్తిని కొనడానికి లేదా విక్రయించడానికి సమయం బాగుంది. ఫలితంగా లాభాలు వస్తాయి. ఈ నెల బిజిగా అలాగే సంతోషంగా గడుపుతారు. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఫలితంగా బంధుత్వాలు మెరుగుపడుతాయి.  సంతాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొత్తగా పెళ్లిచేసుకున్న వారు శుభవార్తలు అందుకోగలుగుతారు .  చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

​కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశివారికి  పనిలో ఒత్తిడి ఎదుర్కొంటారు. సరిఅయిన సలహాలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. సామాజిక మాధ్యమాల్లో మీకు ప్రత్యేకత లభిస్తుంది. మీరు ఆచితూచి మాట్లాడటంవల్ల గౌరవం లభిస్తుంది.  లేకుంటే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతారు. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.  మీ బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుతాయి.  ఇంటి పునర్నిర్మాణ పనుల్లో పెట్టుబడి పెట్టి విజయాన్ని అందుకుంటారు. అతి త్వరలో నూతన వాహనాలు, విలువైన వస్తువులను సంపాదించడానికి సన్నాహాలు వేస్తారు.  వైవాహిక జీవితం మెరుగు పరుచుకోవాలి.

​మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

ఈ రాశివారు   నైపుణ్యం, సామర్థ్యాన్ని పెంచుకొనే ప్రయత్నంలో ఉంటారు.   మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీపై మీకు విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు.  మీరు కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడే కొత్త విధానాన్నిఅమలు చేస్తారు.  మీ అభిరుచులు నెరవేరడానికి ఈ నెల అనుకూలంగా ఉంది.  సృజనాత్మకత మెరుగుపడుతుంది.  మీకు మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ దృఢత్వం పెరుగుతుంది. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీరు  వివాదాలు, తగాదాలకు తావివ్వకండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button