మణిరత్నం త్వరలో నవరత్నాలతో ప్రయోగం చేయనున్నారు…ఏంటది !

మణిరత్నం అతి త్వరలో ఒక విభిన్నమైన వెబ్ సిరీస్ ని రూపొందించనున్నారు. దీనికిగాను నవరత్నాలలాంటి, దర్శకులను, మ్యూజిక్ డైరెక్టర్లను, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్ ని తీసుకుని ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ ని రూపొందించనున్నారు.
ప్రస్తుతం అందరు అంతగా బిజీ లేకపోవడంతో ఈ వెబ్ సిరీస్ తీయడానికి ఇదే మంచి సమయం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో దర్శకుల విషయానికి వస్తే తొమ్మిది మంది దర్శకులతో, తొమ్మిది ఎపిసోడ్స్ గా ఇది ప్రసారం చేయనున్నారు. దీనిని నెట్ ఫ్లిక్ లో విడుదల చేయనున్నారు.
ఆ తొమ్మింది మంది దర్శకులు కేవీ ఆనంద్, కార్తీక్ నరేన్, అరవింద్ స్వామి, మొదలైనవారు ఉండనున్నారు.
అలాగే స్టార్ హీరోల విషయానికి వస్తే, సూర్య, రోబో శంకర్, శ్రీరామ్, మొదలైనవారు నటించనున్నారు.
మరియు సంగీత దర్శకులు, ఏ ఆర్ రహెమాన్, మణిరత్నం, జిబ్రాన్, కార్తీక్ మొదలైనవారు సంగీతం సమకూర్చనున్నారు.
ఈ వెబ్ సిరీస్ ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చుడాలిమరి.