Mandatory Rest to RaPo : రామ్ కి రెస్ట్ తప్పనిసరి :-

Mandatory Rest to RaPo : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , ఈ పేరు కి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. మొదటి సినిమా నుంచి మొన్న రిలీజ్ అయినా ఇష్మార్ట్ శంకర్ దాకా తనదైన స్టైల్ లో ప్రేక్షకులని అలరిస్తూనే వచ్చారు , భవిష్యత్తులో కూడా ఇలాగె అలరిస్తారు కూడా.
అయితే రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయినప్పటికీ రామ్ కాన్సంట్రేషన్ అంత లింగు స్వామి దర్శకత్వం లో తమిళ్ మరియు తెలుగు బై – లింగువల్ సినిమాపైనే ఉందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం రామ్ ఎన్నడూలేని విధంగా కష్టపడుతూ, మంచి ఫీజిక్ మైంటైన్ చేస్తూ , హెల్త్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు.
అయితే అనుకోకుండా రామ్ నెక్ ఇంజ్యూర్ అయి తప్పని పరిస్థితిలో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి రామ్ , లింగు స్వామి సినిమా షూటింగ్ కూడా ఆపేసారు.
రామ్ పూర్తిగా కోలుకొని నార్మల్ అయ్యేదాకా ఎటువంటి షూటింగ్స్ ఉండవని తేలిపోయింది. రామ్ నెక్ ఇంజురీ అవడం తో సోషల్ మీడియా లో రామ్ ఫోటో పెట్టి రెస్ట్ తప్పనిసరి అని పోస్ట్ చేశారు.
ఈ వార్త విన్న రామ్ సన్నిహితులు అస్సలు ఇదెలా జరిగింది అని రామ్ కి సోషల్ మీడియా లో ప్రశ్నిస్తుండగా , రామ్ అభిమానులు బాధతో రామ్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ వారి బాధను వ్యక్తం చేసారు.
రామ్ నెక్ పెయిన్ త్వరగా తగ్గిపోయి ఎప్పటిలాగే అందరిని నవ్వించే రామ్ బయటికి రావాలని , షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుందాం.