Manchi Rojulochaie Movie Review | హిట్టా ఫట్టా

Movie :- Manchi Rojulochaie (2021) Review
నటీనటులు :- సంతోష్ శోభన్ , మెహ్రీన్ పిర్జాదా , అజయ్ ఘోష్ , శ్రీనివాస్ రెడ్డి మొదలగు
నిర్మాతలు :- శ్రీనివాస్ కుమార్ (SKN)
సంగీత దర్శకుడు :- అనూప్ రూబెన్స్
డైరెక్టర్ :- మారుతి
Release Date: 2nd november 2021
ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free) :-
ఈ కథ బెంగళూరు లోని ఒక కంపెనీ లో ఎంప్లాయిస్ గా సంతు ( సంతోష్ శోభన్ ) మరియు పద్మ ( మెహ్రీన్ ) ని చూపిస్తూ మొదలవుతుంది. వీరిద్దరూ ఎప్పటినుంచో డీప్ లవ్ లో ఉన్నారని తెలుస్తుంది. వెంటనే సీన్ గోపాల్ తిరుమలశెట్టి(అజయ్ ఘోష్) దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. గోపాల్ చాల ప్రొటెక్టీవ్ తండ్రి. పద్మ పైన చాల ప్రొటెక్టీవ్ గా ఉంటారు.
అలాంటి ప్రొటెక్టీవ్ తండ్రికి తన కూతురు పద్మ లవ్ లో ఉందని స్నేహితుల ద్వారా తెలుస్తుంది. ఆలా కాసేపు తండ్రి పడే తపన కామెడీ రూపం లో చుపియగా చివరికి గోపాల్ , పద్మ విషయం పై క్లారిటీ గా తెలుసుకొని సంతు ని మర్చిపోవాలి అని కండిషన్ పెట్టి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఇంతలో సంతు వచ్చి పెళ్లిచూపులు చెడకొడుతుంటాడు. కొని అనుకోని సంఘటనల వాళ్ళ ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది.
అసలు ఎం జరిగింది ? ఎందుకు వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అస్సలు గోపాల్ తిరుమలశెట్టి కి ఉన్న భయం ఏంటి ? ఎందుకు పద్మ లవ్ లో ఉందంటే అంతలా భయపడుతున్నాడు? వీటన్నిటి మధ్య సంతు ఎలా తన ప్రేమను గెలుచుకుంటాడు? గోపాల్ ని ఎలా ఒప్పించగలిగాడు అనేది థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- అజయ్ ఘోష్ నటన సినిమా అంతా ప్రేక్షకులని అలరించేస్తుంది. సినిమా అంతా అయిన చుట్టే తిరగడం ఆయన పండించిన కామెడీ జనాలని బాగా నవిస్తుంది. సంతోష్ శోభన్ కూడా చాలా బాగా చేసి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేహ్రీన్ క్యూట్ గా అందంగా చాలా బాగుంది సినిమాలో.
- దర్శకుడు మారుతి సినిమా మొదటినుంచి కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు.
- కామెడీ సన్నివేశాలు చాల బాగున్నాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పడాల పంకజం కామెడీ చాలా బాగుంది.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- మొదటి బాగం లో అలరించినంత సెకండ్ హాఫ్ లో అలారించలేకపోయారు.
- కరోనా యాంగిల్ పెద్దగా వర్క్ ఔట్ అవ్వలేదు.
Overall:-
మొత్తానికి మాంచిరోజులొచ్చాయి అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా కామెడీ లవర్స్ కి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే మారుతి తన మార్క్ కథ తో భయం అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించారు.
అజయ్ ఘోష్ పాత్రనే సినిమాని ఓ మెట్టు పైకి తీసుకొని వెళ్లిందని చెప్పాలి. మొదటి భాగం లో అజయ్ ఘోష్ నటన ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులని బాగా అలరిస్తుంది. సంతోష్ కూడా బాగా చేశారు. మెహ్రీన్ చాలా క్యూట్ గా అందంగా ఉంది. కామెడీ సన్నివేశాలు ముఖ్యంగా అప్పడాల పంకజం సినిమాకే హైలైట్.
సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి.సెకండ్ హాఫ్ పెద్దగా అలరించకపోయిన ఓవరాల్ గా ప్రేక్షకులు హ్యాపీ గా ఓసారి చూసి నవ్వుకుంటారు. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
Rating :- 3. /5