News
వామ్మో.. సులభ్ కాంప్లెక్స్ లో మటన్ దుకాణం..!

ఎవరైనా మటన్ కావాలంటే దగ్గర్లో ఉన్న సంబంధిత మటన్ దుకాణానికి వెళ్తుంటారు… కానీ ఒక దగ్గర మాత్రం మటన్ కావాలంటే సులబ్ కాంప్లెక్స్ కి వెళ్తారట.. ఈ వార్త వింటే మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.. కాని ఇది నిజం..
ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిథిలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి సులబ్ కాంప్లెక్స్ ఎదుట ఓ మటన్ షాప్ ఏర్పాటు చేశాడు. ఇటు సులబ్ కాంప్లెక్స్ నుండి వచ్చే జీతం తో సంతృప్తి చెందకుండా మటన్ షాప్ నడుపుకుంటూ లాభాలు పొందాలని ఆశపడ్డాడు.
కానీ అక్కడ ఉన్న స్థానికులు దీన్ని గమనించి ఇండోర్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు కాంప్లెక్స్ లో తనిఖీలు నిర్వహించడంతో అడ్డంగా దొరికిపోయాడు. సులబ్ కాంప్లెక్స్ లో మటన్ దుకాణం పెట్టినందుకు ఆ వ్యక్తికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు