News
లాకర్లో ఉన్న డబ్బుల కట్టలను తినేసిన చెదలు

ఓ బ్యాంక్ లాకర్లో ఒక కస్టమర్ దాచుకున్న లక్షలాది డబ్బుల కట్టలను చెదలు తినేశాయి. అసలు ఇది ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అనేది తెలుసుకుందాం…
ఈ ఘటన గుజరాత్లోని వడోదరలో చోటు చేసుకుంది.
ప్రతాప్ నగర్ కి చెందిన రెహ్నా కుతుబీద్దీన్ దేసర్వాల్ అనే వ్యక్తి బరోడా బ్యాంక్ లాకర్లో రూ.2.20 లక్షల డబ్బును దాచుకున్నాడు. దీంతో ఇటీవలే లాకర్ ఓపెన్ చేయగా…ఆ నగదును చెదల పురుగులు తినేశాయి.
దీంతో ఆ వ్యక్తి లబోదిబోమంటూ బ్యాంక్ అధికారులను ఆశ్రయించాడు. తను నష్టపోయిన డబ్బులను బ్యాంకే చెల్లించాలని బాధితుడు డిమాండ్ చేశాడు.తమ డబ్బును బ్యాంకు లాకర్లో దాచుకున్నా కూడా రక్షణ లేదని కుతుబీద్దీన్ ఆవేదన వ్యక్తం చేశాడు.