సన్యాసం తీసుకున్న సినిమా ఆర్టిస్టులు!
Film artists who have taken sannyas రంగుల ప్రపంచం నుండి బయటికి వచ్చి ప్రశాంత జీవితం గడపాలనుకున్నారో ఏమో, సినిమా ఫీల్డులో చాలా బిజిగా ఉన్న సమయంలోనే సినిమా కెరీర్ కి పులిస్టాప్ పెట్టి ఈ ఐదుగురు సన్యాసం లో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
సన్యాసం తీసుకున్న ఆ ఐదుగురు వీరే…
మమతా కులకర్ణి:

mamatha kulakarni కుర్ర కారుని తన అందాలతో 1990 లో ఒక ఊపు ఊపి, బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకొని ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. తన అందచందాలతో ప్రేక్షకులను సినిమా థియేటర్ల వద్దకు రప్పించే వారు. మమతా కులకర్ణి సినిమాలో మంచి ఫామ్ లో ఉండగానే సడ్డెన్ గా శ్రీ ఛైతన్య గంగంగిరి నాథ్ గారి దగ్గర శిక్షణ తీసుకొని ఈయన ఆధ్వర్యంలో సన్యాసాన్ని తీసుకున్నారు.
అను అగర్వాల్:

anu agarval ఢిల్లీకి చెందిన ఈ అందాల ముద్దుగుమ్మ మోడల్ రంగం పై ఉన్న మక్కువతో ముంబై కి వచ్చి మోడల్ రంగం నుండి సినిమా రంగంలో అడుగుపెట్టి మొదటగా సినిమా ‘ఆషికి’ చిత్రం ద్వారా పరిచమై తనకంటూ మంచి స్టార్ డాం సంపాదించుకొని కొద్దీ కాలం సినిమా రంగంలో ఉండి 1997 లో ఉత్తరాఖండ్ లోని ఓకే ఆశ్రమం లో యోగినిగా చేరి తన జీవనాన్ని సంతోషంగా గడుపుతుంది.
సోఫియా హయత్:

sofiya hayath సోఫియా హయత్ మొట్టమొదటగా ఒక ఛాలెంజింగ్ లో న్యూడ్ గా 2014 లో ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసి యూత్ ని ఆకర్షించింది. అదేవిదంగా బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని ప్రజలకు దగ్గరైంది. ఈ నటి కూడా తన కెరీర్ సినిమాలో సాఫీగా సాగుతున్న సమయం లోనే సన్యాసిగా చేరి ప్రజలని ఆశ్చర్యానికి గురి చేసింది.
బర్ఖా మదన్:

barka madan ఈ నటి అటు సీరియల్స్ లో సినిమాలలో నటిస్తూ ఉండేది. ఈ మెరుపుతీగ 1984 లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ పొజీషన్ కి వెళ్ళింది. తను కూడా సిక్కిం కి చెందిన బౌద్ధ మఠాన్ని ఆశ్రయించి సన్యాసిగా మారింది.
వినోద్ ఖన్నా:

vinod khanna ఈ హీరో తన ఆకర్షణీయమైన పర్సనాలిటీతో ఎంతో మంది మహిళా ప్రేక్షకులకు దగ్గరైనాడు. ఈయన 1970 నుండి 1980 వరకు సినిమా అనే రంగుల ప్రపంచాన్ని ఏలి మెల్లగా సన్యాసం వైపు అడుగులు వేసాడు. ఈయన సన్యాసంలో కలవడంతో వినోద్ ఖన్నాకు తన భార్య విడాకులు ఇవ్వడం కూడా జరిగింది.