Tollywood news in telugu

ప్రణయ్ కోసం పాటను అంకితం చేసిన ఈ సినిమా

ప్రపంచంలో ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావం. దానికి కులo, మతం, జాతి, పేద, ధనిక అనే భేదాలు ఏవి తెలియవు. అంతటి గొప్ప స్వచ్చమైన ప్రేమని మనుషులు వారి వారి స్వార్ధానికి బలి పశువును చేస్తున్నారు. మనం శాస్త్ర సాంకేతిక పరంగా ఏంటో ముందుకు వెళ్ళినప్పటికీ ఇంకా కులం, మతం, జాతి అని ఎందుకు పనికిరాని వాటికోసం సొంత బిడ్డల భవిష్యత్తుని కూడా బుగ్గిపాలు చేస్తున్నాం అంటే ఎంత సిగ్గు చేటో కదా. ఈ ప్రేమ కోసం మన భారతదేశoలో ఎన్నో పరువు హత్యలు జరిగాయి. కొన్ని సంఘటనలలో ప్రేమికులు ఇద్దరు బలవ్వగా, కొన్నింటిలో ప్రేమికుల ఇద్దరిలో ఎవరో ఒకరు బలికాగా మరొకరు జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.

అయితే ఇప్పుడు ఇలాంటి ఒక ఘోరమైన దారుణం మన తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ప్రాంతంలో జరిగింది. ఈ పరువు హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చే. ఒకరకంగా ఈ పరువు హత్య రాష్ట్రాన్ని కుదిపేసింది అనే చెప్పాలి. ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించిన అమృతవర్షిని అనే అమ్మాయి తన తల్లితండ్రులను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంది. ప్రణయ్ దళితుడు కావడంతో అతడిని అల్లుడిగా అంగీకరించని అమృత తండ్రి ప్రణయ్ ని ఒక పక్కా ప్లాన్ ప్రకారం భారీ మొత్తంలో సుఫారీ ఇచ్చి హత్య చేయించాడు. తన కన్న కూతురు గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా చేజేతులారా తన బిడ్డ పసుపు కుంకుమలను తుడిచిన ఒక నర రూప రాక్షసుడు అమృత తండ్రి మారుతీ రావు. అయితే ఈ పరువు హత్యపై పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

తాజాగా ఇప్పుడు మరో టాలీవుడ్ సినిమా క్రైమ్ డ్రామాగా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్న ‘veera bhoga vasantharaayulu’ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా ప్రేమకోసం బలైన వారికి అంకితమిస్తున్నామని, తాజాగా జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌కు ఈ పాటను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. దీనికి సంభందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పాటను సెప్టెంబర్‌ 21న విడుదల చేయనున్నారు. యంగ్ హీరోస్ నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ ఈ ‘veera bhoga vasantharayulu’ చిత్రం. దర్శకత్వం నూతన దర్శకుడు ఆర్. ఇంద్రసేన. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రయోగాత్మకమైన చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button