Malli Modalayindi Movie Review :-

Movie :- Malli Modalayindi (2022) Review
నటీనటులు :- సుమంత్ , నైన గంగూలీ , వర్షిణి , పోసాని , సుహాసిని మొదలగు
నిర్మాత :- కే. రాజశేఖర్ రెడ్డి
సంగీత దర్శకుడు :- అనూప్ రూబెన్స్
దర్శకుడు :- టీ.జి. కీర్తి కుమార్
Story (spoiler Free ):-
ఈ కథ విక్రమ్ (సుమంత్) నీ చెఫ్ లా చూపిస్తు మొదలవుతుంది. విక్రమ్ కి మ్యారేజ్ లైఫ్ అంతగా బాగోలేదు. తన భార్య నిషా (వర్షిణి ) టార్చర్ భరించలేక ఒకరోజు నిషా విడాకులు కావాలని అడిగిన వెంటనే విక్రమ్ అంగీకరించడం తో ఇద్దరి మధ్య విడాకులు మంజూరైంది. కొన్ని రోజుల తర్వాత విక్రమ్, నిషా స్నేహితురాలైన పవి (నైన గంగూలీ) నీ ప్రేమించడం మొదలుపెడతాడు.
ఇప్పుడు విరిదరి దాంపత్య జీవితం ఎలా ఉండబోతుంది ? వీరు మళ్ళీ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కబోతున్నారా లేదా ? వీరిద్దరి మధ్య రీసెట్ అనే ఆప్షన్ ఎందుకు వచ్చింది ? విడాకులు తీసుకున్న తర్వాత నిషా ఎం చేసింది ? అస్సలు ఎందుకు విడాకులు తీసుకున్నారు? విక్రమ్ మరియు పవి లా రీసెట్ కాన్సెప్ట్ ఎంటి ? చివరికి ఎం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా జీ 5 లో చూసేయండి.
Positives 👍:-
- సుమంత్ పర్ఫార్మెన్స్. సినిమా అంతా చాలా బాగా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. నైన గంగూలీ కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగిలిన పాత్రధారులు వారివారి పాత్ర పరిదిలో బాగా చేశారు.
- కథ మరియు రీసెట్ అనే కాన్సెప్ట్.
- కొన్ని సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్.
Negatives 👎:-
- దర్శకుడు కథ కొత్తగా రాసుకున్నారు కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు.
- పాటలు పెద్దగా ఆకట్టుకోవు.
- బోరింగ్ గా అనిపిస్తుంది.
Overall :-
మొత్తానికి మళ్ళీ మొదలైంది అనే సినిమా కథ పరంగా బాగున్నప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకులను నిరాశ కలిగిస్తుంది. సుమంత్ చాలా బాగా నటించారు. నైన గంగూలీ కూడా చాలా బాగా చేసింది. వర్షిణి పాత్ర కాస్త చిరాకు తెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు వారివారి పాత్ర పరిధిలో బాగా చేశారు.
కథ మరియు రీసెట్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది కానీ దర్శకుడు దాని సద్వినియోగ పరుచుకొలేదు. మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొత్త కథ చూస్తే చాలు అనుకునేవారు ఈ సినిమాని ఓసారి చూసేయచు.
Rating :- 2/5