Tollywood news in telugu

Maldives : మాల్దీవులు అంటే సినీ స్టార్స్ కి ఎదుకంత మోజు … అక్కడ ఏముంటుందో తెలుసుకోండి…!

Maldives is a craze for movie stars

Maldives  : మాల్దీవులు.. ఒక ప్రశాంతమైన అందమైన బుల్లి  దేశం.. కాస్త సమయందొరికితే చాలు పక్షుల్లాగా వాలిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్లేవారిలో సినీ తారలు వారి ఫామిలీ తో , కొందరు సింగిల్ గా వెళ్తూ ఉంటారు. ఇక మామూలు ప్రజలు కూడా ఎక్కువగా వెళ్లారు. .

ముక్యంగా అక్కడికి వెళ్ళడానికి గల కారణం పరిశిలిస్తే… కొందరు ప్రశాంతంగా సేదతీరుదామని, మరికొందరు స్ట్రెస్ నుండి బయటపడటానికి, ఇక డైరెక్టర్స్ ఐతే కథలు రాసుకోడానికి, ఫోటో షూట్ కోసం మోడల్స్, పెళ్ళైన కొత్త జంటలు , బర్త్ డే పార్టీలకు వెళ్తూ ఉంటారు.

అక్కడవుండే స్వచ్ఛమైన నీరు, గాలి ఆస్వాదిస్తూ ఉంటె స్వర్గానికి వెళ్లినట్టు ఉంటుంది. ఇక భోజనప్రియులు వీరికి కావలసిన సీ ఫుడ్ చాల వెరైటీస్  దొరుకుతుంది. అందుకనే కాస్త సమయం దొరకగానే మాల్దీవ్స్ కి చెక్కేస్తారు.

ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్, కొత్త పెళ్లికూతుళ్లు కాజల్​, నిహారిక తమ భర్తలతో కలిసి హనీమూన్‌కి వెళ్ళింది. ఇంకా నాగార్జున ఫామిలీ మొత్తం వెళ్లారు. సుందరి తాప్సీ ఫొటో షూట్​ చేసి కుర్రకారు మతులు పోగొట్టింది.

అలాగే రకుల్ ప్రీతిసింగ్‌​ మాల్దీవుల సముద్ర బీచ్​ల్లో ,  యోగా, ఎక్సర్​సైజ్​లు చేస్తూ హాట్​ హాట్​ పిక్​లతో అలరించింది. ​సమంతా కూడా ఫొటోలతో కిక్కెక్కిచ్చింది. సూర్య , జ్యోతిక దంపతులు, కేజీఎఫ్​ స్టార్​ యష్​ దంపతులు కూడా తమ పిల్లలతో కలిసి  వెళ్లారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్ నుండే కాకుండా అన్ని ఇండస్ట్రీలనుండి, చిన్నలు, పెద్దలు  వెళ్తూనే  ఉంటారు.

 కరోనా కాలంలో  కష్టాలెదుర్కొన్న మాల్దీవ్స్ వ్యాపారులు ఇపుడిపుడే కోలుకుంటున్నారు. అందులో భాగంగా సినీస్టార్ లకు చాల తక్కువ ఖర్చుకే ఆఫర్స్ ని ప్రకటించి ఆకర్షించుకుంటున్నారు. వీరిని బుట్టలో పడేస్తే , వీరు చేసే హంగామా ప్రజల దృష్టికి వెళ్లి , ప్రజలు  కూడా మాల్దీవ్స్ కి వస్తారని , మాల్దీవ్స్ వ్యాపారుల ప్లాన్. ఎదైతేనేమి ఎవరి బిజినెస్ ట్రిక్స్ వారివి. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button