Mahesh Fans totally disappointed with the decision of SVP Team : మహేష్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే మిగిలింది :-

Mahesh Fans totally disappointed with the decision of SVP Team : అవును మీరు చదివింది మేము చెప్పింది నిజమే. మహేష్ బాబు ఫ్యాన్స్ కలలని బురదలో పోసిన పానీరయింది. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా.
మ్యాటర్ లోకి వెళ్తే ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల తేదీ ప్రకటించక ముందు నుంచే సూపర్ స్టార్ మహేష్ బాబు చెయ్యబోయే సర్కార్ వారి పాట సినిమా సంక్రాంతి బరిలో మిగితా సినిమాలతో పోటీకి సిద్ధం అని , జనవరి 13 న గ్రాండ్ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఎప్పుడైతే ఆర్.ఆర్.ఆర్. విడుదల తేదీ ప్రకటించారో ఇండస్ట్రీ లో ఎక్కడ లేని విధంగా సంక్రాతి బరిలో నిలబడే సినిమాలని పోస్ట్ పోన్ గ్యారంటీ అనే రేంజ్ లో వార్తలు వచ్చాయి. వార్తలైతే వచ్చాయి కానీ ఎవరు అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా సంక్రాంతి బరిలో నిలబడే సినిమాలు తగ్గేదెలా ఆర్.ఆర్.ఆర్ సినిమా అయినా సరే గట్టి పోటీనే ఇస్తాం అని విడుదల తేదీని మార్చకుండా అనుకున్న తేదీనే విడుదల చేస్తున్నారు భీమ్లా నాయక్ , రాధే శ్యామ్ బృందాలు.
కానీ ఏమైందో తెలియదు సంక్రాంతి రేస్ నుంచి మహేష్ సర్కార్ వారి పాట సినిమా అధికారికంగా తప్పుకుంది. ఈ సినిమా ముందుగా అనుకున్న జనవరి 13 న విడుదల కాకుండా ఏకంగా ఏప్రిల్ 1 2022 కి పోస్ట్ పోన్ చేసేశారు చిత్రబృందం.
మొత్తానికి మహేష్ కి అచ్చుబాటు వచ్చిన సంక్రాంతి పండుగను పక్కనపెట్టి రిలీజ్ వాయిదా వేసేశారు. ఈ వార్త విన్న అభిమానులు బాధ పడుతున్నారు. టీజర్ తోనే సినిమా మీద ఎన్నడూ లేనంత హైప్ తెచ్చిపెట్టి చివరికి పోస్ట్ పోన్ చేయడం ఏంటి అని అభిమానులు సోషల్ మీడియా లో చిత్రబృందాలకు ట్యాగ్ చేసి మరి వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.