Mahesh and Sanjay Dutt a Deadly Combination : మహేష్ బాబు కి పోటాపోటీగా సంజయ్ దత్ :-

Mahesh and Sanjay Dutt a Deadly Combination : వరుస సినిమాలతో బిజీ గా కాలం గడుపుతున్న మహేష్ బాబు , హిట్ సినిమాలే తీయాలని సెలెక్టివ్ గా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు తీస్తున్నారు. అదే తరహాలో వచ్చిన సినిమాలే భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరూ .ఇలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న మహేష్. చాల ఏళ్ళ తర్వాత కొత్త లుక్స్ తో , డిఫరెంట్ కాన్సెప్ట్ తో సర్కార్ వారి పాట అనే సినిమా తీస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమా సంక్రాంతి 2022 కి విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా సర్కార్ వారి పాట తర్వాత మహేష్ , త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు. ఈ విషయం అధికారికంగా తెలిసిందే. ఖలేజా తర్వాత దాదాపు 10 ఏళ్ళ తర్వాత కలవనున్న ఈ కాంబినేషన్ ప్రతి విషయం లో ఆచి, తూచి అడుగులు వేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మహేష్ కి పోటీగా సంజయ్ దత్ చేయబోతున్నారు అని చిత్ర సీమలో టాక్ నడుస్తుంది. అంటే మహేష్ కోసం కి మొట్టమొదటి సారిగా బాలీవుడ్ హీరో కాస్త విలన్ గా మారబోతున్నారు. అదే ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా మారనున్నారు.
సంజయ్ దత్ ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో కే.జి. యఫ్ 2 లో అధీర పాత్రతో తెలుగు లో పరిచయం అవనున్నారు. దీని తర్వాత సంజయ్ దత్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో విలన్ గా చేయనున్నారు.
చూడాలి మరి మహేష్ మరియు సంజయ్ దత్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అని. విలన్ గా సంజయ్ దత్ ఏ విధంగా ప్రేక్షకులని అలరించబోతున్నాడో అని.