Maha Samudram Movie Review- మహా సముద్రం (2021)

Movie : Maha Samudram Review
నటీనటులు :- శర్వానంద్ , సిద్ధార్థ్ , అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ , జగపతి బాబు , రావు రమేష్
నిర్మాతలు :- అనిల్ సుంకర
సంగీత దర్శకుడు :- చైతన్ భరద్వాజ్
Director : – Ajay Bhupathi
Story (Spoiler Free) :-
ఈ కథ శర్వానంద్ టెన్షన్ లో కార్ నడుపుతూ ఉన్న సిట్యుయేషన్ తో మొదలవుతుంది కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ శర్వానంద్ మరియు సిద్ధార్థ్ బెస్ట్ ఫ్రెండ్స్ సీన్స్ చూపిస్తూ రెబెల్ సాంగ్ తో సినిమా కొనసాగుతుంది. ఆలా ఆలా శర్వా , అను ని ప్రేమించే సన్నివేశాలు , మరియు సిద్ధార్థ్ , అదితి ల ప్రేమ సన్నివేశాలు తో సినిమా టెంపో బాగానే సాగుతుంది.
అదే సమయాన జగపతి బాబు , రావు రమేష్ , కే జి యఫ్ రామ్ ల స్టైలిష్ ఇంట్రో జరుగుతుంది. మొత్తానికి అందరి పాత్రల ఇంట్రడక్షన్ పూర్తయ్యాక కొని అనుకోని సంఘటనల చేత సిద్ధార్థ్ కే జి యఫ్ రామ్ ని చంపే ప్రయత్నం చేస్తాడు , సిద్ధార్థ్ ఈ విషయం శర్వానంద్ కి మరియు జగపతి బాబు కి చెప్పగా రామ్ చనిపోయాడు అని ఊహించుకొని సిద్ధార్థ్ ని ఊరు వదిలిపెట్టు వెళ్ళిపో అని చెప్తారు.
శర్వానంద్ అదితి ని తీసుకొని రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి సిద్ధార్థ్ ట్రైన్ ఎకేసింటాడు , శర్వానంద్ మరియు అదితి ట్రైన్ వెనకాల పరిగెత్తినా సిద్ధార్థ్ ఇన్ డైరెక్ట్ గా ఎవరు అవసరం లేదు అని ఒంటరిగా వెళ్ళిపోతాడు.
అసలు సిద్ధార్థ్ ఎందుకు అదితి మరియు శర్వానంద్ ని వదులుకొని ఒంటరిగా వెళ్లాలనుకున్నాడు ? సిద్ధార్థ్ ఎందుకు కే.జి.యఫ్ రామ్ ని చంపే ప్రయత్నం చేసాడు ? వీటన్నింటికి మధ్య సిద్ధార్థ్ ఎందుకు విలన్ లా మారిపోయాడు ? స్నేహితులు శత్రువులుగా మారడానికి జరిగిన కథ ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ఒకరిని మించి మరొకరు పాత్రలో మునిగిపోయి ప్రేక్షకులని తమదైన స్టైల్ లో సినిమా మొత్తం అలరిస్తారు. అదితి రావు మరియు అను కూడా బాగానే చేసారు.
- జగపతి బాబు మరియు రావు రమేష్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
- కథ మరియు కధనం
- దర్శకుడు అజయ్ భూపతి సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు.
- యాక్షన్ సన్నివేశాలు చాల బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- లెంగ్త్ ఎక్కువ.
- కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి.
ముగింపు :-
మొత్తానికి మహా సముద్రం అనే సినిమా అజయ్ భూపతి స్టైల్ దర్శకత్వం లో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ చేసిన బెస్ట్ సినిమా అనిపిస్తది. శర్వానంద్ మరియు సిద్ధార్థ్ పాత్రలో జీవించేసారు. అను మరియు అదితి కూడా ఉన్నంతలో బాగా చేసారు. రావు రమేష్ , జగపతి బాబు గారి నటన అయితే కెరీర్ బెస్ట్. సినిమా మొదటినుంచి చివరిదాకా అజయ్ భూపతి కథ ను నమ్మే తీసినట్లు అనిపించింది. కథ మరియు కధనం బాగున్నాయి. నిర్మాణ విలువలు స్టైలిష్ గా కనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. మొత్తానికి మహా సముద్రం సినిమా లెంగ్త్ ఎక్కువైనా అందరి పెర్ఫార్మన్స్ మరియు అజయ్ భూపతి కథని నడిపించే విధానం కోసం ఓసారి చూసేయచ్చు.
Rating :- 3.25 /5