Magical Words over Allu Arjun : అల్లుఅర్జున్ పై తన అభిప్రాయాన్ని తెలిపిన ముంబై బ్యూటీ :-

Magical Words over Allu Arjun : ముంబై బ్యూటీ అంటే ఎవరో అనుకునేరు. ఎవరో కాదు వైశాలి , బెంగాలీ.. ఎలాగైనా పట్టాలి అంటూ బన్నీ చెప్పిన అమ్మాయే హన్సిక. వీరిద్దరు కలిసి దేశముదురు సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పటికి, ఇప్పటికి కుర్రగాలకి చూడగానే పిచ్చెక్కిస్తాది.
ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఈ సినిమాలో తన నటనకి వచ్చిన ఆదరణ అంత ఇంత కాదు. ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ లో హన్సికకి ఇప్పటికి సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
అయితే ఇటీవలే హన్సిక తన ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చాట్ సెషన్ పెట్టగ ఒక అభిమాని అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పమని కోరాడు. దానికి హన్సిక ” స్వీటెస్ట్ , కైండెస్ట్ , ఫన్నీయెస్ట్ , మై ఫస్ట్ కో – స్టార్”’ అంటూ సమాధానం చెప్పగా ఈ పోస్ట్ కి ఎంతగానో ఇంప్రెస్స్ అయ్యి బన్నీ హన్సిక స్టోరీ ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ గా కూడా పెట్టుకోని ” థాంక్యూ స్వీట్ హార్ట్ ” అంటూ స్పందించారు.
ఈ పోస్ట్స్ చుసిన అభిమానులు ముఖ్యంగా దేశముదురు సినిమా అభిమానులు మళ్ళీ వీరిద్దరు కలిసి నటించాలని కోరుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. చూడాలి మరి వీరిద్దరు కలిసి దేశముదురు కి మించి బ్లాక్ బస్టర్ సినిమా తీస్తారని కోరుకుందాం.