Tollywood news in telugu

Maestro Bold scenes are chopped off : మాస్ట్రో బోల్డ్ సీన్స్ అన్ని కట్ :-

Maestro Bold scenes are chopped off

Maestro Bold scenes are chopped off : నితిన్ వరుస పరాజయాలతో బాధపడుతున్న సమయంలో హిందీ లో బ్లాక్ బస్టర్ అయినా అంధదున్ సినిమాని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమానే మాస్ట్రో గా మన ముందుకు రాబోతుంది. నితిన్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా అయినా మరల హిట్ ట్రాక్ లోకి రావాలని.

అయితే హిందీలో లాగానే తెలుగులో కూడా బోల్డ్ సీన్స్ షూట్ చేసారు. నితిన్ , నభ నటేష్ , తమన్నా మధ్య బోల్డ్ సీన్స్ చిత్రీకరించారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం డైరెక్ట్ ఓటీటీ లో విడుదల అవ్వనుంది. థియేటర్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ లో సెప్టెంబర్ 17 న విడుదల అవ్వడం తో చిత్ర బృందం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

అదేంటంటే థియేటర్ రిలీజ్ అయ్యింటే సినిమాలో బోల్డ్ సీన్స్ అలాగే పెట్టేవారు , కానీ ప్రస్తుతం ఓటీటీ లో విడుదల కాబట్టీ కుటుంబం అంత కలిసి చూడాలని చిత్ర బృందం మరియు హాట్ స్టార్ టీం కలిసి బోల్డ్ సీన్స్ అని కట్ చేసేయాలి అని నిర్ణయించుకున్నారని తెలిసింది.

కాబట్టి మాస్ట్రో సినిమాలో , హిందీ సినిమాలో లాగా బోల్డ్ సీన్స్ ఉంటాయని ఆశగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా లాగా ఉండబోతుంది ఈ మాస్ట్రో. చూడాలి మరి ఈ సినిమా ద్వారా నితిన్ హిట్ కల నెరవేరుతుందో లేదో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button