telugu gods devotional information in telugu
అందరికి సంతానభాగ్యం కలిగించే తల్లి ఈవిడే
మంగళ వారం నాడు వివాహం అయి సంతానం లేనివారు చాలామంది సుబ్రమణ్య స్వామిని పూజిస్తు ఉంటారు.సతీ సమేతముగా ఉన్న స్వామి వారిని తగు రీతిలో పూజించి సత్ సంతానాన్ని పొందవచ్చని స్మృతులు చెబుతున్నాయి.
సుబ్రమణ్య స్వామి వారి దేవెరులు వల్లి మరియు దేవసేనా దేవి.దేవసేనా దేవికి షష్టి దేవి అను పేరు కుడా కలదు.ఈ సృష్టి లో ఏ వ్యక్తి కి సంతానం కలుగవలె అన్నా కుడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి చివరికి దేవతలకు కుడా సంతానాన్ని ప్రసాదించే శక్తివంతమైన తల్లి.శక్తి చైతన్యం యొక్క ఆరవ రూపమే షష్టి దేవి.పిల్లిని వాహనం గా కలిగి ఉంటుంది.పిల్లల యొక్క ఆరోగ్యం,మంచి చెడులు చూసే తల్లి ఈవిడ.ఎలాంటి బాలారిష్టాలు ఉన్నా కుడా అమ్మని భక్తితో సేవిస్తే చాలు సమస్యల్ని పటాపంచలు చేస్తుంది.
ఆలాంటి తల్లి ని నేటి మంగళ వారం పూజించి తరిద్దామా…
ఓం షష్టి దేవ్యై నమః
Very Nice